‘మా ప్రార్థనలు ఇంత త్వరగా ఫలిస్తాయని ఊహించలేదు..’ భారత్ నుంచి కోవిడ్ వ్యాక్సిన్ రాకపై డొమినికన్ పీఎం భావోద్వేగ సందేశం

రూజ్వెల్ట్ స్కెర్రిట్ (Image : Twitter)

‘మా దేశ ప్రజలు ప్రార్థనలు ఫలించాయి. కానీ అవి ఇంత త్వరగా ఫలిస్తాయని మేము ఊహించలేదు 72 వేల జనాభా ఉన్న మా దేశానికి కరోనా వ్యాక్సిన్ ను పంపించాలని కోరిన వెంటనే భారత్ దానికి స్పందించింది..’ అంటూ డొమినికన్ (Dominican) పీఎం రూజ్వెల్ట్ స్కెర్రిట్ (Roosevelt Skerrit) అన్నారు.

 • News18
 • Last Updated :
 • Share this:
  ప్రపంచ మహమ్మారి కరోనాను అంతరించడానికి భారత్ తయారుచేసిన వ్యాక్సిన్ దానిని స్వదేశానికే కాకుండా ప్రపంచానికంతటికీ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కరేబియన్ ద్వీపాలలో ఉన్న చిన్న దేశం డొమినికన్ రిపబ్లిక్ కు కూడా భారత్ తన వ్యాక్సిన్లను డొమెనికాకు పంపింది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని రూజ్వెల్ట్ స్కెర్రిట్ (Roosevelt Skerrit) స్పందించారు. వ్యాక్సిన్ ను మోసుకెళ్లిన విమానాలు వారి దేశంలో చేరని వెంటనే ఆయన కృతజ్ఞతా సందేశాన్ని వినిపించారు.

  ఈ సందర్భంగా రూజ్వెల్ట్ స్పందిస్తూ... ‘మా దేశ ప్రజలు ప్రార్థనలు ఫలించాయి. కానీ అవి ఇంత త్వరగా ఫలిస్తాయని మేము ఊహించలేదు 72 వేల జనాభా ఉన్న మా దేశానికి కరోనా వ్యాక్సిన్ ను పంపించాలని కోరిన వెంటనే భారత్ దానికి స్పందించింది. మా అభ్యర్థన మీద 35 వేల (సగం దేశానికి సరిపడా..) వ్యాక్సిన్ లు వచ్చాయి. ఇంత త్వరగా టీకాలు మా దేశానికి వస్తాయని మేము అస్సలు ఊహించలేదు.. ప్రధాని మోడీకి, భారతీయ ప్రజలకు మాదేశ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు...’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

  ప్రపంచాన్ని కబళించిన కరోనా మహమ్మారి డొమినికాను కూడా పీడించింది. చిన్న దేశమైనా కోవిడ్ ధాటికి అతలాకుతలమైన ఈ దేశాన్ని ఆదుకోవాలని.. కోవిడ్ వ్యాక్సిన్ లను పంపించాలని గతనెల 19న భారత్ ను కోరారు రూజ్వెల్ట్. దీనికి ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారు. ఇటీవలే అక్కడికి కోవిడ్ వ్యాక్సిన్ ను పంపించగా.. అవి డొమినికా డగ్లస్ చార్లెస్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. వ్యాక్సిన్ రాక సందర్భంగా పీఎం రూజ్వెల్ట్ సహా ఆయన క్యాబినెట్ మంత్రులు కూడా వ్యాక్సిన్ బాక్సులను మోయడం గమనార్హం. ఇందుకు సంబంధించి కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ఒక ట్వీట్ కూడా చేశారు.

  డొమినికా తో పాటు ఆఫ్రికా లోని ఉగాండా, ఈక్వెడార్, ఎల్ సాల్వెడార్, నికర్ గునియా, మొరాకో, నమీబియా వంటి దేశాలకు కూడా భారత్ కోవిడ్ వ్యాక్సిన్ ను సరఫరా చేయనున్నది. సుమారు 25 దేశాలకు 24 మిలియన్ల డోసులను పంపేందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే.
  Published by:Srinivas Munigala
  First published: