Video : కుక్కకు గోళ్లు కత్తిరించబోతే... ఏమైందో తెలుసా...

Drama Dog : మనుషులకు గోళ్లు పెరిగితే... నెయిల్ కట్టర్‌తో కట్ చేసుకుంటారు. పెంచుకునే కుక్కలకు గోళ్లు కట్ చేసే పని కష్టమైనది. కుక్కలు సహకరించవు. మరి ఆమె విషయంలో ఏమైంది. కుక్క ఏం చేసింది.

Krishna Kumar N | news18-telugu
Updated: September 8, 2019, 11:09 AM IST
Video : కుక్కకు గోళ్లు కత్తిరించబోతే... ఏమైందో తెలుసా...
డ్రామాలాడుతున్న కుక్క (Image : YT - Strange Videoz)
Krishna Kumar N | news18-telugu
Updated: September 8, 2019, 11:09 AM IST
పెంచుకునే కుక్కలు... తమ ఓనర్ల దగ్గర చిట్టి పాపాయిల్లా మారాం చేస్తుంటాయి. ఆహారం పెట్టి తినమంటే తినవు... మూలుగుతూ ఉంటాయి. బయటకు తీసుకెళ్లమని మారాం చేస్తాయి. స్నానం చేయించాలన్నా, గ్రూమింగ్ చేయించాలన్నా... ప్రతి దానికీ కుక్కలు బతిమలాడించుకుంటూ ఉంటాయి. ఆమె విషయంలోనూ అదే జరిగింది. తన కుక్కకు గోళ్లు కత్తిరించాలని ఆమె నెయిల్ కట్టర్ తీసుకొచ్చింది. దాన్ని చూడగానే... ఆ కుక్క... "అమ్మనాయనో... నెయిల్ కట్టర్... అయిపోయాన్రా దేవుడా" అన్నట్లు ఫేస్ పెట్టుకొని... కట్టర్ వైపు భయంభయంగా చూసింది. కానీ ఓనర్ ఊరుకోలేదు. "కమాన్ నీ కాలు ఇవ్వు" అని ఓ కాలును పట్టుకుంది. కట్టర్‌తో గోరును కట్ చెయ్యబోయింది. అంతే... ఆ కుక్క ఏం చేసిందో... కింది వీడియోలో మీరే చూడండి.



సహజంగా మనుషులకు ఇలాంటి తెలివితేటలు ఉంటాయి. కానీ ఇక్కడ ఓ కుక్క శవంలా పడిపోయింది. అలా చేస్తే... తన ఓనర్... తనను వదిలేస్తుందనీ, తన గోళ్లను కట్టర్‌తో కట్ చెయ్యకుండా ఉంటుందనీ ఆ కుక్క అనుకుంది. అందుకే ఈ డ్రామా ఆడింది. అయినప్పటికీ... ఓనర్ ఊరుకోలేదు. నీ డ్రామాలు నా దగ్గర సాగవు అంటూ... గోళ్లు కత్తిరించేసింది. ఇప్పుడీ వీడియో... సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ కుక్క యాక్టింగ్ చూసి... "ఓరి దీని యేసాలో" అంటున్నారు.

First published: September 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...