Home /News /international /

DOCTORS KILLED 100 VULTURES FOR MEDICINES BY USING POISONED BUFFALO IN SOUTH AFRICA SK

Vultures Death: గేదెకు విషంపెట్టి చంపి.. దానిని ఎరగా వేసి 100 రాబందులను చంపేశారు..

రాబందుల మృత కళేబరాలు

రాబందుల మృత కళేబరాలు

Vultures: ప్రపంచ మొత్తం మీద ప్రస్తుతం రెండు లక్షల 70 వేలకు రాబందులే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ఏటా 800 రాబందులను మందుల తయారీ కోసమే చంపేస్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  ఈ ప్రపంచంలో ఎన్నో జీవ జాతులు అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని జంతువులు, పక్షుల సంఖ్య భారీతా తగ్గింది. వేలపై వాటిని లెక్కవచ్చు. అంత తక్కువగా ఉంది. అలాంటి వాటిని ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాల ద్వారా సంరక్షించాలి. వాటి సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలి. కానీ ప్రపంచంలో చాలా చోట్ల అలాంటివేమీ జరగడం లేదు. పైగా అంతరించిపోతున్న జీవులనే చంపేస్తున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నారు. ప్రస్తుతం రాబందులను సంఖ్య బాగా పడిపోయింది. మనదేశంలో అయితే అసలు కనిపించడం లేదు. ఎప్పుడో ఒకసారి.. ఎక్కడో ఒక చోట మాత్రమే ఇవి కనిపిస్తున్నాయి. అలాంటి రాబందులను దక్షిణాఫ్రికాలో విచ్చలవిడిగా చంపడం ఆందోళన కలిగిస్తోంది. ఒకేసారి వంద రాబందులు చనిపోవడంపై పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు.

  China Population: పిల్లలు కనండి ప్లీజ్... ఎంత ఎక్కువ మందిని కంటే అన్ని సబ్సిడీలు..

  దక్షిణాఫ్రికా (South Africa)లోని క్రూగర్ నేషనల్ పార్క్‌లో వంద రాబందులు ఒకేసారి చనిపోవడం సంచలనం రేపింది. పదుల సంఖ్యలో రాబంధులు మరణించడం.. వాటి శరీర భాగాలు కట్ చేసి ఉండడం.. స్థానికంగా తీవ్ర కలకల సృష్టించింది. అసలు ఇన్ని రాబందులు అక్కడికి ఎలా వచ్చాయి? అవన్నీ ఎలా చనిపోయాని మొదట్లో ఎవరికీ అర్థం కాలేదు. అన్నింటిలోనూ ఒకేరమైన విషం ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ క్రమంలోనే దీనిపై దక్షిణాఫ్రికా అధికారులు కమిటీ వేశారు. కమిటీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు డాక్టర్లు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. రాబంధుల శరీర భాగాలను కొన్ని రకాల మందుల తయారీలో వినియోగిస్తారు. దాని కోసమే రాబంధులను చంపేసినట్లు నిర్ధారించారు.

  కాటేసిన పామును.. కసిదీరా కొరికి చంపిన రెండేళ్ల చిన్నారి.. మరి పాప పరిస్థితి.

  ఓ గేదెను ఎరగా వేసి పెద్ద మొత్తంలో రాబందులను చంపేశారు. ముందుగా క్రూగర్ నేషనల్ పార్క్‌లో ఓ గేదెకు విషం పెట్టి చంపేశారు. ఆ గేదె మరణించింది. కొన్ని రోజుల తర్వాత దాని శరీర భాగాలు కుళ్లిపోయి.. దుర్వాసన వచ్చింది. మృత కళేబరాన్ని తిన్న తర్వాత.. రాబంధులు కూడా మరణించాయి. గేదె శరీరంలో ఉన్న విషం.. రాబంధులకు కూడా పాకింది..దాని వల్లే అవి చనిపోయాయని అధికారులు తెలిపారు. ఆ తర్వాత రాబందుల శరీర భాగాలను డాక్టర్లు కోసుకెళ్లారని వెల్లడించారు. రాబందులతో పాటు హైనా, మరికొన్ని ఇతర జంతవులు కూడా పార్క్‌లో మరణించాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు.  ఈ పార్క్‌లో జంతువులను ఇలా వేటాడడం కొత్తేమీ కాదని యాక్టింగ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్‌ అన్నారు. ఇతర జంతువులను ఎరగా వేసి పక్షులు, జంతువులను చంపుతున్నారని పేర్కొన్నారు. వారిని గురించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నివేదికల ప్రకారం.. ఇప్పుడు ఈ ప్రాంతంలో కేవలం ఇరవై రాబందులు మాత్రమే సజీవంగా ఉన్నాయి. ఇప్పుడు వాటి మనుగడ కూడా కష్టమయింది. రాబంధుల సంఖ్య ఏటేటా తగ్గుతూ వస్తోంది. బెఇందులో మందుల వల్ల ఏటా 800 మంది చనిపోతున్నాయి. రుమటిజమ్, డయాబెటిస్ సహా అనేక మందుల తయారీలో వీటి శరీర భాగాలను వాడుతారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: International news, South Africa

  తదుపరి వార్తలు