Viral Video: మహిళ చెవిలో మష్రూమ్స్ చూసి ఆశ్చర్యపోయిన వైద్యులు...

పరీక్షలో భాగంగా చెవిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందేమోనని టార్చ్ లైట్ వేసి చూశాడు. అయితే చిన్న చిన్న బొడిపెల్లాంటి పదార్థాలను చూసి ఆశ్చర్యపోయాడు. అంతే వెంటనే ఎండోస్కోపీ చేయించుకోమన్నాడు.

news18-telugu
Updated: September 15, 2019, 8:23 PM IST
Viral Video: మహిళ చెవిలో మష్రూమ్స్ చూసి ఆశ్చర్యపోయిన వైద్యులు...
మహిళ చెవిలో పుట్టగొడుగులు (Youtube)
  • Share this:
ఓ మహిళ చెవిలో పెరుగుతున్న పుట్టగొడుగులు చూసి ఆశ్చర్యపోవడం అందరి వంతూ అయ్యింది. పుట్టగొడుగులు అనేవి సాధారణంగా కుళ్లిన గడ్డి, తేమ ప్రాంతాల్లో లేస్తాయి. అయితే విచిత్రంగా ఓ మహిళ చెవిలో కుప్పులు కుప్పలుగా మొలవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళితే వియత్నాంలోని డీన్ బీన్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన చెవిలో దురదగా ఉందని దగ్గరలో ఉన్న వైద్యుడిని సంప్రదించగా, అతడు చెవిని పరీక్షించాలన్నాడు. పరీక్షలో భాగంగా చెవిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందేమోనని టార్చ్ లైట్ వేసి చూశాడు. అయితే చిన్న చిన్న బొడిపెల్లాంటి పదార్థాలను చూసి ఆశ్చర్యపోయాడు. అంతే వెంటనే ఎండోస్కోపీ చేయించుకోమన్నాడు. దీంతో ఒక వైద్యుల బృందం మహిళ చెవిలో కెమెరా పంపి చూడగానే ఆశ్చర్యపోయారు. ఆమె కర్ణభేరి చుట్టూరా పుట్టగొడుగులు మొలిచి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. చివరకు డాక్టర్లు ఆమె చెవిని శుభ్రం చేసి లోపల ఉన్న పుట్టగొడుగులను తొలగించారు. అయితే మైక్రో మష్రూమ్ జాతికి చెందిన కొన్ని విత్తనాలు మహిళ చెవిలో చేరడంంతో ఈ పరిస్థితి తలెత్తిందని వైద్యులు పేర్కొన్నారు.

Published by: Krishna Adithya
First published: September 15, 2019, 8:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading