హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

China: వాస్తవాధీన రేఖపై కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా.. భారత సరిహద్దును ఆక్రమించుకునేలా డ్రాగన్​ కొత్త చట్టం

China: వాస్తవాధీన రేఖపై కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా.. భారత సరిహద్దును ఆక్రమించుకునేలా డ్రాగన్​ కొత్త చట్టం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనా ప్రభుత్వం అన్ని ఒప్పందాలను తుంగలో తొక్కి భారత్‌తో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసీ) వద్ద కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత భూభాగాలను ఆక్రమించుకునేందుకు డ్రాగన్ దేశం వరుస పన్నాగాలు పన్నుతోంది. పైగా దాని దుందుడుకు చర్యలను చట్టబద్ధం చేయాలనుకుంటోంది.

ఇంకా చదవండి ...

చైనా ప్రభుత్వం (China government)అన్ని ఒప్పందాలను తుంగలో తొక్కి భారత్‌తో వాస్తవాధీన రేఖ (LAC) వద్ద కయ్యానికి కాలు దువ్వుతోంది. భారత భూభాగాలను (Indian lands) ఆక్రమించుకునేందుకు డ్రాగన్ దేశం వరుస పన్నాగాలు పన్నుతోంది. పైగా దాని దుందుడుకు చర్యలను చట్టబద్ధం చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా ఇటీవల నూతన భూసరిహద్దు చట్టానికి (land border law) ఆమోదం తెలిపింది. దేశ సరిహద్దు ప్రాంతాల రక్షణ, స్వలాభార్జన (protection and exploitation) పై చైనా జాతీయ చట్టాన్ని (National law) రూపొందించడం ఇదే తొలిసారి. ఈ చట్టం (law) వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. జాతీయ భద్రతను మెరుగ్గా నిర్వహించడం.. ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య సరిహద్దు (border) సంబంధిత విషయాలను చట్టపరమైన స్థాయిలో నిర్వహించడమే లక్ష్యంగా కొత్త చట్టాన్ని తీసుకువచ్చినట్టు చైనీస్ మీడియా (china media) చెబుతోంది. వివాదాస్పద భూ సరిహద్దుల వెంబడి తన చర్యలను సమర్థించుకోవడానికి డ్రాగన్ కంట్రీ నూతన చట్టాన్ని రూపొందించిందని నిపుణులు (experts) అభిప్రాయపడుతున్నారు. ఈ చట్టం ఏం చెబుతోంది? దీనివల్ల ఇండియా (India)పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడనుంది? భూ సరిహద్దు వివాదాలు ఎంత తీవ్రంగా ఉన్నాయి? వంటి విషయాలు తెలుసుకుందాం.

చట్టం ఏం చెబుతోంది?

ఈ కొత్త చట్టం దేశం సరిహద్దుల వెంబడి దండయాత్ర, ఆక్రమణ, చొరబాటు, రెచ్చగొట్టడం వంటి చర్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (China PLA)ని ఆదేశించిందని నివేదికలు తెలుపుతున్నాయి. అవసరమైతే సరిహద్దును మూసివేయాలని (Close borders) చట్టం చెబుతుందని.. అందుకు చట్టపరమైన విధివిధానాలను కూడా రూపొందించిన్నట్లు జర్మనీ మీడియా (Germany media) వెల్లడించింది. సరిహద్దు రక్షణను బలోపేతం చేయడానికి, ఆర్థిక సామాజిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి.. సరిహద్దు ప్రాంతాలను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి చైనా (china) ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చట్టం చెబుతున్నట్లు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వార్తాపత్రిక 'చైనా డైలీ (china daily)' పేర్కొన్నది. ఈ చట్టం సరిహద్దు ప్రాంతాల్లో ప్రజల జీవనాన్ని ఆచరించాలని చెబుతోంది. ప్రజలు అక్కడ పని చేయడం కోసం ప్రజా సేవలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చింది.

వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను పరిష్కరించాలని..

మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడి (Investments) ద్వారా వివాదాస్పద సరిహద్దు ప్రాంతాలను పరిష్కరించాలని చైనా భావిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. తరచూ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే సరిహద్దు గ్రామాల్లో (border villages) ప్రజలకు ఎలా నివసిస్తారనే సందేహాలు కూడా చట్టం (law) నివృత్తి చేసింది. సరిహద్దు రక్షణ (border protection).. సరిహద్దు ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక అభివృద్ధి మధ్య సమన్వయాన్ని చైనా ప్రోత్సహిస్తుందని కొత్త చట్టం (new law) చెబుతోంది. అయితే పహారా కాయడానికి దేశ ఆర్మీ సిబ్బందికి సామాన్య పౌరులు సైతం సహకరించాల్సిందిగా చట్టం చెబుతున్నట్లు జపాన్ మీడియా వెల్లడించింది.

ఇండియాపై ప్రభావం..

చైనా టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్ (Global times) భారతదేశంతో ఘర్షణలు ప్రాంతీయ ఉద్రిక్తతలలో ఒకటిగా ఉంటున్నట్టు గుర్తు చేసింది. దీనికి వ్యతిరేకంగా కొత్త చట్టాన్ని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ (national people standing committee) ఆమోదించిందని తెలిపింది. ఈ చట్టం సరిహద్దు వ్యవహారాలకు సంబంధించి విస్తృత పరిధిని కలిగి ఉంది. ప్రాదేశిక సరిహద్దు కార్యకలాపాల్లో నాయకత్వ వ్యవస్థ (leadership system), ప్రభుత్వ బాధ్యతలు, సైనిక పనులు ఈ చట్టం స్పష్టం చేయనుంది. భూ సరిహద్దుల సర్వేయింగ్, సరిహద్దుల రక్షణ, నిర్వహణ వంటి వాటిని కూడా ఇది చట్టబద్ధం చేయనుంది. అలాగే భూ సరిహద్దు (land borders) వ్యవహారాలపై అంతర్జాతీయ సహకారాన్ని (International help) స్పష్టం చేయనుంది.

3,488 కి.మీ సరిహద్దు..

చైనా తన భూ సరిహద్దులను 14 దేశాలతో 22,000 కి.మీ వరకు పంచుకుంటోంది. ఐతే దాని భూభాగం చారిత్రక అవగాహన, అసలు వాస్తవాల మధ్య అసమతుల్యత ఉంది. ఫలితంగా ఎప్పటి నుంచో వివాదాలు తలెత్తుతున్నాయి. భారత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home ministry) ప్రకారం ఈశాన్యంలో అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) నుంచి ఉత్తరాన జమ్మూ & కశ్మీర్ వరకు చైనాతో భారతదేశం 3,488 కి.మీ సరిహద్దును పంచుకుంటుంది. కానీ ఈ సరిహద్దును పూర్తిగా నిర్ణయించలేదు. వాస్తవాధీన రేఖ (LAC) స్పష్టం చేసే, నిర్ధారించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సమానత్వం, పరస్పర విశ్వాసం, స్నేహపూర్వక సంప్రదింపుల సూత్రాన్ని అనుసరించాలని సరిహద్దు చట్టం బీజింగ్ కు సూచించింది. పొరుగు దేశాలతో ఉన్న దీర్ఘకాలిక సరిహద్దు సమస్యలను సమూలంగా పరిష్కరించడానికి చర్చల జరపాలని చట్టం చెబుతున్నట్లు చైనా మీడియా (China media) పేర్కొంది. సరిహద్దు నదులు, సరస్సుల స్థిరత్వాన్ని కాపాడే చర్యలు కూడా తీసుకోవాలని కొత్త చట్టం సూచిస్తుంది. చైనా టిబెట్ అటానమస్ రీజియన్‌లో మూలాన్ని కలిగివున్న బ్రహ్మపుత్ర నది నీటి గురించి కూడా ఈ చట్టం పేర్కొంది.

ఎల్‌ఎసీ వివాదం ప్రస్తుత పరిస్థితి ఏంటి?

గత ఏడాది మేలో తూర్పు లడఖ్‌లోని ఎల్‌ఎసీ (LAC) ద్వారా చైనా సైనికులు (China soldiers) చొరబడ్డారు. ఆపై ఇరువైపులా భారీ సైనిక బలగాలు మోహరించాయి. ఈ ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు దేశాలు సైనిక స్థాయి చర్చలు జరుగుతున్నాయి. గత ఏడాది జూన్‌లో జూన్‌లో గల్వాన్‌ లోయలో భారత్‌- చైనా సైనికుల ముళ్లబడితెలతో ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత కూడా చైనా (china) వివాదాలకు తెర లేపుతోంది. రెండు నాల్కల ధోరణితో ఓ వైపు చర్చలు చేస్తూనే మరోవైపు ఘర్షణలకు దారితీస్తోంది. తూర్పు లడఖ్‌లో రెండు దేశాలు ఇప్పటికీ 50 వేల నుంచి 60,000 మంది సైనికులను ఉంచాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్, ఉత్తరాఖండ్‌లో చైనా దళాలు తాజాగా చొరబాట్లు చేసినట్లు నివేదికలు వచ్చాయి. సరిహద్దుల వెంబడి మోహరిస్తున్న డ్రాగన్ సైనికులను ప్రతిఘటించడానికి భారత సైనికులు ఎప్పుడూ అక్కడే ఉంటారని భారత ఆర్మీ చీఫ్ అక్టోబర్ లో చెప్పుకొచ్చారు. చైనా 12 పొరుగు దేశాలతో సరిహద్దు వివాదాలకు ముగింపు పలికింది. భారత్, భూటాన్  (Bhutan) లతో మాత్రం ఇప్పటి వరకు సరైన సరిహద్దు నిర్ణయించలేదని నివేదికలు చెబుతున్నాయి.

First published:

Tags: Army, China, India, India-China, Indo China Tension

ఉత్తమ కథలు