Home /News /international /

Prince Harry: ప్రిన్స్ హ్యారీకి డయానా నుంచి ఎంత మొత్తం వచ్చిందో తెలుసా?.. ఆ ధీమాతోనే వారు..

Prince Harry: ప్రిన్స్ హ్యారీకి డయానా నుంచి ఎంత మొత్తం వచ్చిందో తెలుసా?.. ఆ ధీమాతోనే వారు..

ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ (File Image)

ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్ (File Image)

ప్రిన్స్ హ్యారీ, మేగన్ మార్కల్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇటు అమెరికాతో పాటు అటు బ్రిటన్ లోనూ పాపులర్ గా మారిపోయింది. ముఖ్యంగా తాము ప్యాలెస్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్న తర్వాత రాజ కుటుంబం ఆర్థిక సహాయం పూర్తిగా ఆపేసిందని హ్యారీ ఈ ఇంటర్య్వూలో వెల్లడించారు.

ఇంకా చదవండి ...
తాజాగా ఓప్రా విన్ ఫ్రేకి ప్రిన్స్ హ్యారీ, మేగన్ మార్కల్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇటు అమెరికాతో పాటు అటు బ్రిటన్ లోనూ పాపులర్ గా మారిపోయింది. రాజ కుటుంబంలో అయితే ప్రకంపనలు రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తాము ప్యాలెస్ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్న తర్వాత రాజ కుటుంబం ఆర్థిక సహాయం పూర్తిగా ఆపేసిందని హ్యారీ ఈ ఇంటర్య్వూలో వెల్లడించారు. తన బిడ్డ నలుపు రంగులో పుడుతుందేమో అని రాజ కుటుంబ సభ్యులు బయపడ్డారని, రాజకుటుంబంలో తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని.. చివరకి చనిపోవాలని కూడా భావించానని మేగన్ చెప్పడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. అలాంటిదేమీ జరగలేదని రాజకుటుంబం చెబుతున్నా.. మేగన్ ని సపోర్ట్ చేసేవారే ఎక్కువగా ఉండడం విశేషం.

రాజ కుటుంబం నుంచి పూర్తిగా ఆర్థిక సహాయం ఆగిపోతే ప్రస్తుతం మేగన్, హ్యారీలు ఎలా జీవిస్తున్నారు? లాస్ ఏంజలిస్ లో వారి విలాసవంతమైన భవానానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నకు కూడా హ్యారీ సమాధానం చెప్పారు. తన తల్లి ప్రిన్సెస్ డయానా తన కోసం వదిలి వెళ్లిన డబ్బుతోనే తాము ప్రస్తుతం జీవిస్తున్నామని చెప్పారు హ్యారీ. మా అమ్మ నాకోసం వదిలివెళ్లిన డబ్బు నా దగ్గర ఉంది. అది లేకపోతే అసలు రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చి ఎలాంటి ఆర్థిక సహకారం లేకుండా మేం జీవించలేకపోయేవాళ్లం. మేం బయటకు వచ్చే సమయంలో తను మమ్మల్ని దగ్గరి నుంచి చూస్తున్నట్లు.. ఆ సమయంలో మాకు సహాయం చేసినట్లుగా నాకు అనిపించింది అని వెల్లడించారు హ్యారీ. ఈ నెట్ ఫ్లిక్స్ షోలు, స్పాటిఫైలు చేయాలని మేం బయటకు వచ్చినప్పుడు భావించలేదు. ఆ డబ్బు ఉందన్న ధైర్యంతోనే బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నాం అన్నారు హ్యారీ. ఆ డబ్బు నుంచే 14. 65 మిలియన్ డాలర్ల మొత్తంతో (సుమారు వంద కోట్ల రూపాయలు) వారు లాస్ ఏంజలిస్ లో ఓ విలాసవంతమైన భవంతిని కొని అందులో నివసిస్తున్నారు.

2020 జనవరిలో హ్యారీ మేగన్ లు తమ రాయల్ టైటిల్స్ ని వదిలేసినప్పుడు రాజ కుటుంబం నుంచి వచ్చే పబ్లిక్ ఫండ్స్ ని కూడా వదిలేయాల్సి వచ్చింది. వారిద్దరూ డయానా అందించిన డబ్బుతోనే ప్రస్తుతం జీవిస్తున్నాం అని చెప్పినప్పటి నుంచి గూగుల్ లో డయానా గురించి హ్యారీ గురించి సెర్చ్ ట్రెండింగ్ లో నిలవడం విశేషం. అందులో ఎక్కువ మంది డయానా హ్యారీకి ఎంత డబ్బు వదిలివెళ్లారు? ప్రిన్స్ హ్యారీ ఆస్తుల విలువ? ప్రిన్స్ హ్యారీకి వారసత్వంగా ఎంత మొత్తం వచ్చింది? లాంటి సెర్చెస్ ఎక్కువ ట్రెండింగ్ లో నిలిచాయి.

ఫాక్స్ బిజినెస్ కథనం ప్రకారం ప్రిన్స్ హ్యారీకి ప్రిన్సెస్ డయానా వదిలి వెళ్లిన అసలు మొత్తం 8.9 మిలియన్ డాలర్ల (సుమారు 65 కోట్ల రూపాయలు) మొత్తాన్ని వదిలి వెళ్లారట. ఇది వడ్డీతో సహా పెరిగి 13 మిలియన్ డాలర్లుగా (సుమారు 95 కోట్ల రూపాయలు) అయిందట. హ్యారీ ముప్ఫైయో పుట్టిన రోజు తర్వాత దీన్ని పొందే వీలుంటుందని డయానా రాసిపెట్టడంతో తాజాగా హ్యారీ వాటిని పొందడం జరిగింది. ఇవే కాదు.. తన పెద్ద కొడుకైన ప్రిన్స్ విలియం (38), కి కూడా తొమ్మిది మిలియన్ డాలర్లను వదిలివెళ్లారు డయానా.

1997లో తాను మరణించే సమయానికి ప్రిన్సెస్ డయానా ఆస్తుల విలువ సుమారు 31.5 మిలియన్ డాలర్లు (సుమారు 229 కోట్ల రూపాయలు). ఇందులో ఎక్కువ మొత్తం ప్రిన్స్ ఛార్లెస్ తో ఆమె విడిపోయినప్పుడు పొందిన భరణమే ఎక్కువగా ఉండడం విశేషం. ఈ మొత్తాన్ని తన ఇద్దరు కొడుకులకు సమానంగా పంచి వారు పాతికేళ్లు వచ్చాక వడ్డీ వచ్చేలా, ముప్ఫై ఏళ్లకు వచ్చాక పూర్తి మొత్తాన్ని పొందేలా వీలునామా రాశారు ప్రిన్సెస్ డయానా.

ప్రిన్సెస్ డయానా నుంచి వచ్చిన మొత్తం కాకుండా పెళ్లికి ముందు తన నటన, ఇతర యాడ్ షూట్స్, కాంట్రాక్ట్స్ ద్వారా మేగన్ పొందిన మొత్తం రెండు మిలియన్ డాలర్లు (పదిహేను కోట్ల రూపాయలు) కూడా వారు లాస్ ఏంజలిస్ లో నివసించేందుకు ఉపయోగపడింది. ఇవి కాక ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలైన నెట్ ఫ్లిక్స్, స్పాటిఫై లతో మిలియన్ డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకున్నారు మేగన్, హ్యారీ. తమ కుటుంబ పోషణ కోసం ఈ ఒప్పందాలు ఉపయోగపడుతున్నాయని హ్యారీ వెల్లడించడం విశేషం.
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Britain, United Kingdom

తదుపరి వార్తలు