సాధారణంగా కంపెనీలు పనితీరు నచ్చకనో, జీతాలు చెల్లించలేకనో ఉద్యోగులను తొలగిస్తుంటాయి. అలా తొలగించబడ్డవారు ఇంకో ఉద్యోగంలో చేరడమో, బిజినెస్ చేసుకోవడమో చేస్తుంటారు. కానీ, ఆ వ్యక్తి మాత్రం అలా కాదు. తాను ఒకప్పుడు పనిచేసిన కంపనీపై రివేంజ్ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ కంపెనీకి భారీ నష్టాన్ని కలిగించాలనుకున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. స్పెయిన్లోని మెర్సిడెస్ బెంజ్ ప్లాంట్(Mercedes-Benz Plant)లో 38 ఏళ్ల వ్యక్తి 2016–17 మధ్య కాలంలో పనిచేశాడు. కానీ, ఎటువంటి కారణం చెప్పకుండానే అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది కంపెనీ. దీంతో కంపెనీపై కోపం పెంచుకున్న ఆ ఉద్యోగి 3 ఏళ్ల తర్వాత జేసీబీతో కంపెనీకి చెందిన లగ్జరీ కార్లను తొక్కించి ధ్వంసం చేశాడు. 2020 డిసెంబర్ 31న ఉత్తర స్పెయిన్(Spain) రాజధాని విక్టోరియా గాస్టిజ్(Vitoria Gasteiz) ఇండస్ట్రియల్ ఏరియాలో గల మెర్సిడెస్ బెంజ్(Mercedes-Benz) కార్ల ఫ్యాక్టరీ పార్కింగ్ స్థలం(Parking Lot)లో ఈ ఘటన జరిగింది.
అసంతృప్తితో రగిలిపోతున్న అతను జేసీబీ(JCB) దొంగతనం చేసి 18 మైళ్లు (29 కిలో మీట్లరు) డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. జేసీబీతో కార్ల ఫ్యాక్టరీ ఎంట్రీ గేటును ఢీకొట్టి.. 50కి పైగా కొత్త కార్లను ధ్వంసం చేశాడు. కాగా, బాగా ధ్వంసమైన కార్లలో హై-ఎండ్ మెర్సిడెస్ బెంజ్ వి క్లాస్ (Mercedes-Benz V class) కార్లతో పాటు అనేక లగ్జరీ ఎలక్ట్రిక్ ఇవిటో కార్లు కూడా ఉన్నాయి. అయితే, ఘటనా స్థలంలో కొంతమంది సేఫ్టీ, మెయింటెనెన్స్ సిబ్బంది మినహా ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తూ ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
Mercedes-Benz has fired #Basque worker from work in Vitoria-Gasteiz in the last day of the year 2020 and he has wrecked 50 vans. #NeoLiberalism #CorporateEmpire #angryworker #solidarity #Proletarianism #WorkerClass #langileria #RiseUp pic.twitter.com/IP1nX73PDH
— Irlandarra (@aldamu_jo) December 31, 2020
ఘటనలో 50కి పైగా లగ్జరీ కార్ల ధ్వంసం..
కాగా, ఈ ఘటనకు పాల్పడిన మాజీ ఉద్యోగిని వెంటనే పోలీసులకు పట్టించింది మెర్సిడెస్ బెంజ్ కంపెనీ. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు(Police Investigation) చేపట్టారు. ప్రాథమిక రిపోర్టు ప్రకారం.. మెర్సిడెస్ బెంజ్ ఫ్యాక్టరీలో కార్ల ధ్వంసంతో 1.78 పౌండ్ల నుంచి 4.45 పౌండ్ల నష్టం వాటిల్లినట్లు కంపెనీ అంచనా వేస్తోంది. అనగా భారత కరెన్సీ దీని విలువ సుమారు రూ.50 కోట్ల వరకు ఉంటుంది. అయితే, మెర్సిడెస్ బెంజ్ స్పెయిన్ (Spain)ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ ఘటనలో మెర్సిడెస్ వి-క్లాస్(V-Class), వీటో(Vito), ఈవీటో(e-Vito), ఈక్యూవి(EQV) వాహనాల డెలివరీలు ఆలస్యం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా, ధ్వంసమైన కార్ల ఫోటోలు సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cars, Mercedes-Benz, Spain