ఆశ్చర్యం... అద్భుతం... వజ్రం లోపల వజ్రం... ప్రపంచంలో ఇదే తొలిసారి...

Matryoshka Diamond : ఈ అనంత విశ్వంలో మన భూమి ఓ అద్భుతం. అందులో జరిగే ప్రకృతి వింతలకు లెక్క లేదు. ఇది అలాంటిదే. ఓ వజ్రం లోపల మరో వజ్రం ఉండటం చూసి సైంటిస్టులే ఆశ్చర్యపోతున్నారు.


Updated: October 9, 2019, 12:06 PM IST
ఆశ్చర్యం... అద్భుతం... వజ్రం లోపల వజ్రం... ప్రపంచంలో ఇదే తొలిసారి...
వజ్రం లోపల వజ్రం (credit - insta - Ross Sedawie)
  • Share this:
Diamond Within Diamond : మన భూమిలో అరుదుగా కనిపించేవి వజ్రాలు. అలాంటి వాటిలో... ఓ వజ్రం లోపల మరో వజ్రం ఉండటం అత్యంత అరుదు. ఎంత అరుదంటే... ఇలాంటి డైమండ్ కనిపించడం ఇదే తొలిసారి. దీన్ని సైంటిఫిక్ భాషలో మాట్రియోష్కా డైమండ్ అంటారు. రష్యా... సైబీరియాలోని ఓ గనిలో ఈ వజ్రం బయటపడింది. ఇందులోని చిన్న వజ్రం... అటూ ఇటూ కదులుతోందని రష్యా స్టేట్ మైనింగ్ కంపెనీ అల్రోసా PJSC తెలిపింది. ఇంతకీ ఈ డైమండ్ ఎప్పుడు పుట్టిందో తెలుసా. 80 కోట్ల సంవత్సరాల కిందటిది. దీని బరువు 0.62 కేరట్లు ఉంది. ఇందులోపల ఉన్న వజ్రం బరువు 0.02 కేరట్లు ఉంది. ఈ వజ్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇప్పటివరకూ కొన్ని వందల గనుల్లో వజ్రాల తవ్వకాలు జరిగాయి. దొరికిన ప్రతి డైమండ్‌నీ రికార్డ్ చేశారు. ఐతే... ఎప్పుడూ ఇలాంటిది కనిపించకపోవడం విశేషం. సాధారణంగా ఏ వజ్రమైనా లోపల ఖాళీ అన్నది ఉండదు. ఏదో ఒక ఖనిజం అందులో చేరిపోతుంది. ఈ డైమండ్ మాత్రం లోపల ఖాళీగా ఉంది. అదే సమయంలో... ఓ చిన్ని వజ్రాన్ని తనలో దాచుకుంది. పెద్ద వజ్రాన్ని అటూ ఇటూ కదుపుతుంటే... చిన్న వజ్రం కూడా అటూ ఇటూ కదులుతోంది.


ప్రస్తుతం ఈ డైమండ్‌ను రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ జియోలాజికల్ ఎంటర్‌ప్రైజ్‌ సంస్థకు పరిశోధన కోసం ఇచ్చారు. సైంటిస్టులు దీన్ని స్పెక్ట్రోస్కోపీ (spectroscopy), ఎక్స్‌రే మోక్రోటోమోగ్రఫీ (X-ray microtomography) వంటి విధానాలతో పరిశోధించనున్నారు. ప్రస్తుతానికి వాళ్ల అంచనా ప్రకారం... ముందుగా చిన్న డైమండ్ పుట్టింది. ఆ తర్వాత దానిచుట్టూ పెద్ద డైమండ్ పుట్టింది. ఈ రెండింటి మధ్యా... ఖాళీ గ్యాప్ ఏర్పడటమన్నది ఆసక్తికర అంశం అని వాళ్లు తెలిపారు. త్వరలో దీన్ని అమెరికాలోని జెమొలాజికల్ ఇన్‌స్టిట్యూట్‌కి కూడా పరిశోధనల కోసం పంపాలనుకుంటున్నారు.


ఇప్పటివరకూ ఇలాంటి డైమండే లేనప్పుడు... దీనికి మాట్రియోష్కా డైమండ్ (Matryoshka Diamond) అనే పేరు ఎక్కడి నుంచీ వచ్చింది అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది. ఇది తాజాగా పెట్టిన పేరే. మాట్రియోష్కా నెస్టింగ్ డాల్ (Matryoshka nesting doll) నుంచీ ఈ పేరు పుట్టింది. ఈ డాల్ మన కొండపల్లి బొమ్మలాగా ఉంటుంది. దీని తల గాలికి అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. తాజా డైమండ్‌లోపలి డైమండ్ కూడా అలాగే కదులుతుండటంతో... ఈ పెద్ద వజ్రానికి ఆ పేరు పెట్టారు.

 

Pics : బిగ్ బాస్ బ్యూటీ నివేదితా సొగసరి అందాలు

ఇవి కూడా చదవండి :

ఆస్తి కోసం 6 హత్యలు... మరో హత్యకు యత్నం... జోలీ కేసులో కొత్త కోణాలు


వామ్మో... ఫుడ్ డెలివరీ ఇచ్చి... కుక్కను ఎత్తుకుపోయాడు

మాట్రిమోనీ సైట్లతో జాగ్రత్త... పోలీసుల తాజా హెచ్చరికలు

జమ్మూకాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు... మళ్లీ తెరచుకున్న స్కూళ్లు
First published: October 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు