ఇండియాతో అమెరికా ట్రేడ్ డీల్... ట్రంప్ ఢిల్లీ టూర్‌లో కుదురుతుందా?

ప్రధాని నరేంద్రమోదీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫోటో)

Trump India Tour : అభిశంసన తీర్మానం నుంచీ బయటపడిన ట్రంప్... అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగేలోపు... తన దేశానికి మరింత ప్రయోజనం కలిగే చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. అందులో భాగమే ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నారా?

 • Share this:
  Trump India Tour : ఇండియా కంటే అమెరికా 40 రెట్లు ఎక్కువ అభివృద్ధి చెందిన దేశం. కానీ అలాంటి దేశం ఇప్పుడు ఇండియా లాంటి దేశాలపై చాలా అంశాల్లో ఆధారపడుతోంది. ఇండియాలో అత్యధికంగా జనాభా ఉండటంతో... ఇలాంటి దేశంతో డీల్స్ కుదుర్చుకుంటే... తమకు బాగా కలిసొస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఐతే... ప్రస్తుతం అమెరికా, ఇండియా మధ్య కొంత గ్యాప్ వచ్చింది. దాన్ని పూడ్చుకునే పనిలో భాగంగా ట్రంప్... ఈ నెల చివరి వారంలో ఇండియా రాబోతున్నారు. ఐతే... ఇండియాతో ఎప్పటి నుంచో కుదుర్చుకోవాలనుకుంటున్న వ్యాపార ఒప్పందాలపై చర్చలు ఇప్పటివరకూ కొలిక్కి రాలేదు. ఇప్పుడు ట్రంప్ రాకతో... ట్రేడ్ డీల్ పట్టాలు ఎక్కుతుందనే ఆశల్లో ఉంది అగ్రరాజ్యం.

  ఫిబ్రవరి 24, 25న ట్రంప్ భారత పర్యటనకు వచ్చే అవకాశాలున్నాయి. ఇందులో ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడమే కీలక అంశంగా కనిపిస్తోంది. ట్రంప్ రాకకు ముందే డీల్‌పై చర్చలు ముగించేసి... ఆయన రాగానే సంతకాలు పెట్టుకోవడం మాత్రమే మిగిలి ఉండేలా అమెరికా ట్రై చేస్తోంది. ఇందులో భాగంగా వచ్చే వారం డీల్ ఫైనలైజ్ అయిపోతుందని అంటున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో విదేశీ మందులు, వైద్య పరికరాలపై 5 శాతం ఇంపోర్ట్ సెస్ (హెల్త్ సెస్) విధించాలని డిసైడైంది. ఇది తమకు తలనొప్పి తెప్పించే నిర్ణయం అని ట్రంప్ భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయం వల్ల స్థానిక మందుల తయారీ కంపెనీలకు కలసివస్తుందని భావిస్తోంది. ప్రస్తుతం వైద్య పరికరాల దిగుమతులపై 0- 7.5 శాతం వరకూ పన్నులున్నాయి. డైరీ ఉత్పత్తులైన చీజ్, బట్టర్, వ్యవసాయ ఉత్పత్తులైన వాల్‌నట్స్‌పై కూడా కేంద్రం కస్టమ్స్ డ్యూటీ పెంచింది. ఈ నిర్ణయాలు తమకు సమస్యగా మారతాయని అమెరికా భావిస్తోంది.

  ఇండియా, అమెరికా మధ్య ఉండే ట్రేడ్ డీల్... 2019 జూన్‌లో రద్దైంది. దాన్ని తిరిగి పట్టాలెక్కించే పని జరుగుతోంది. వైద్య పరికరాలపై సెస్ కూడా తొలగించాలని అమెరికా కోరుతున్నట్లు తెలిసింది. 2019 సెప్టెంబర్‌లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం జరిగినప్పుడు అమెరికా, భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరేదే. కొన్ని విషయాల్లో భారత్ అభ్యంతరం చెప్పడంతో డీల్ ఆగిపోయింది. మరి ఇప్పుడైనా డీల్ కుదిరితే తమకు కలిసొస్తుందని అమెరికా హడావుడి పడుతోంది.


  Published by:Krishna Kumar N
  First published: