2050 నాటికి భూమిపై ఆహారం దొరకదు...హెచ్చరించిన ఐరాస సర్వే...

వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో జలవనరులు తరిగిపోతాయని ఫలితంగా 30శాతం పంట దిగుబడులు మందగిస్తాయని పేర్కొంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తులకు 50 శాతం డిమాండ్ పెరుగుతుందని, తీవ్ర కరువు కాటకాలు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది.

news18-telugu
Updated: September 11, 2019, 11:03 PM IST
2050 నాటికి భూమిపై ఆహారం దొరకదు...హెచ్చరించిన ఐరాస సర్వే...
ప్రతీకాత్మకచిత్రం
news18-telugu
Updated: September 11, 2019, 11:03 PM IST
గ్లోబల్ వార్మింగ్ ఫలితంగా భూమిపై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తద్వారా తీవ్ర ఆహార సంక్షోభం వస్తుందని ఒక అంతర్జాతీయ సర్వే ఆందోళన వెల్లిబుచ్చింది. సంక్షోభం వల్ల 2050 సంవత్సరం నాటికి భూమిపై ఆహారం దొరకదని యూఎన్ సెక్రటరీ జనరల్ బన్ కీ మూన్ నేతృత్వంలో ద గ్లోబల్ కమిషన్ ఆన్ అడాప్షన్ పేరిట నిర్వహించిన సర్వేలో తేల్చింది. అంతే కాదు వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో జలవనరులు తరిగిపోతాయని ఫలితంగా 30 శాతం పంట దిగుబడులు మందగిస్తాయని పేర్కొంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆహార ఉత్పత్తులకు 50 శాతం డిమాండ్ పెరుగుతుందని, తీవ్ర కరువు కాటకాలు వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది.

అయితే ఆహార కొరత ఏర్పడ దేశాల్లో భారత్ కూడా ఉంటుందని తేలింది. ఇక ప్రపంచ జనాభా 1000 కోట్లు దాటితే, ఆహార పంటలు పండించే భూముల విస్తీర్ణం తగ్గిపోతుందని, అటవీ ప్రాంతాలు తరిగిపోతాయని సర్వే పోర్కొంది. ఫలితంగా వర్షాలు తగ్గిపోయి ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయని, ధృవ ప్రాంతాల్లో మంచు కరిగి సముద్ర తీర ప్రాంతాలు మునిగే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...