హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

ఇండోనేషియా ప్రమాదం: ఆ విమానం నడిపింది భారతీయుడే

ఇండోనేషియా ప్రమాదం: ఆ విమానం నడిపింది భారతీయుడే

కెప్టెన్ భవ్య సునేజా (Source: Facebook)

కెప్టెన్ భవ్య సునేజా (Source: Facebook)

జకార్తా నుంచి పంకకల్ పినాంగ్‌కు బయలుదేరిన లయన్‌ జెట్‌ పాసింజర్‌( జేటీ-610)విమానం సముద్రంలో కూలిపోయింది. టేకాఫ్ అయిన 13 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. విమానంలో 189 మంది ప్రయాణించినట్లు తెలుస్తోంది.

ఇండోనేషియాలో లయన్ ఎయిర్ విమానం సముద్రంలో కూలిపోయిన విషయం తెలిసిందే. ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 188 మంది గల్లంతయ్యారు. ఐతే ఆ విమానాన్ని నడిపింది ఇండియన్ పైలట్ అని తెలుస్తోంది. ఢిల్లీకి చెందిన కెప్టెన్ భవ్య సునేజ్ ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం..సునేజా ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతంలో నివసించేవారు. అహ్లాన్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారు. 2011 మార్చిలో లయర్ ఎయిర్ సంస్ధలో పైలట్‌గా చేరారు.

జులైలో అతనితో మాట్లాడా. చాలా మంది మనిషి. అతడు అనుభవం కలిగిన పైలట్. ఇప్పటివరకు పైలట్‌గా అతని రికార్డులో ఎలాంటి లోపాలు లేవు. అందుకే అతన్ని ఇండోనేషియా ఎయిర్ లైన్స్ సంస్థలోనే ఉంచాలనుకున్నాం. కానీ కుటుంబ కోసం స్వస్ధలం ఢిల్లీలో పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. అంతలోనే ఈ ప్రమాదం జరిగింది.
లయన్ ఎయిర్ లైన్స్ ప్రతినిధి

సోమవారం ఉదయం ఇండోనేషియా విమాన ప్రమాదం జరిగింది. జకార్తా నుంచి పంకకల్ పినాంగ్‌కు బయలుదేరిన లయన్‌ జెట్‌ పాసింజర్‌( జేటీ-610)విమానం సముద్రంలో కూలిపోయింది. టేకాఫ్ అయిన 13 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. విమానంలో 189 మంది ప్రయాణించినట్లు తెలుస్తోంది. సుమారు 30-40 మీటర్ల లోతులోకి విమానం దూసుకెళ్లిందని సమాచారం. సముద్రంలో విమానం శకలాలు కనిపించడంతో..సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

First published:

Tags: Indonesia, Plane Crash

ఉత్తమ కథలు