ఆమాద్మీ పార్టీ.. ఈ పార్టీ గురించి అందరికీ తెలుసు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఈ పార్టీ ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉంది. 2012లో పురుడు పోసుకున్న ఆప్.. వస్తూనే ఢిల్లీలో సంచలనాలు సృష్టించింది. కాంగ్రెస్, బీజేపీలకు షాక్ ఇస్తూ.. అధికారం కైవసం చేసుకుంది. రానున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలను కూడా ఆమాద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పక్కా ప్రణాళికతో పంజాబ్, గోవాలో బరిలోకి దిగుతోంది. ఐతే ఇదే ఆమాద్మీ పేరుతో పాకిస్తాన్లో ఓ కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. దీనికీ అరవింద్ కేజ్రీవాల్‌కు ఎలాంటి సంబంధం లేదు. కేవలం పేరు మాత్రమే ఒకేలా ఉంది. అదే పాకిస్తాన్ ఆమ్ ఆద్మీ మూవ్మెంట్ (PAAM). అచ్చం కేజ్రీవాల్ ఆమాద్మీ పేరుతో ఉన్న ఈ కొత్త పార్టీని రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ జనరల్ సాద్ ఖట్టక్ స్థాపించారు.
Sahara Desert: మండే ఎడారిలో మంచు కురుస్తోంది.. యుగాంతానికి ఇదే సంకేతమా?
పాకిస్థాన్ వార్తా సంస్థ డాన్ కథనం ప్రకారం.. జనవరి 16న కరాచీ ప్రెస్‌క్లబ్ పాకిస్తాన్ ఆమ్ ఆద్మీ మూవ్మెంట్ పార్టీ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సాద్ ఖట్టక్ తమ పార్టీ విధివిధానాలు, లక్ష్యాన్ని ప్రజలకు వివరించారు. సామాన్య ప్రజలకు అధికారం కల్పించడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఆమ్ ఆద్మీ మూవ్మెంట్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. తమ పార్టీ నిజమైన ప్రజాప్రతినిధిగా పని చేస్తుందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ రాజకీయాల్లోకి కొత్త రక్తం రావాల్సిన అవసరం ఉందని.. అందుకే సామాన్యుడికే అధికారం లక్ష్యంతో పార్టీని స్థాపించినట్లు సాద్ ఖట్టక్ పేర్కొన్నారు. కుటుంబ, భూస్వామ్య, పెట్టుబడిదారుల ఆధిపత్య రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
Speech in party launching at karachi press club on 16 jan 2022. pic.twitter.com/2wjHh3vTxp
— Saad Khattak (@SaadKhtk) January 19, 2022
వామ్మో ఎంత పెద్ద సైకిల్.. కారు కంటే దీని ఖరీదే ఎక్కువ..
మేజర్ జనరల్ సాద్ ఖట్టక్.. పాకిస్తాన్లో రిటైర్డ్ ఆర్మీ అధికారి. మేజర్ జనరల్ స్థాయిలో సైన్యానికి సేవలందించారు. ఆయన శ్రీలంకలో పాకిస్తాన్ హైకమిషనర్‌గా కూడా ఉన్నారు. అతను బలూచిస్తాన్, FATAలో భద్రత, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో కీలక భూమిక పోషించారు. సైన్యంలో ఉన్నప్పుడు అనేక ఆపరేషన్స్ ట్రైనింగ్ అసైన్మెంట్లలో ఆయన పనిచేశారు. అలాంటి సాద్ ఖట్టక్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి.. కొత్త పార్టీని ప్రకటించడం.. పాకిస్తాన్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అక్కడి ప్రజల్లోనూ ఇది హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.