ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 17మంది మృతి..

బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన 400మీ. లోయలో పడిపోయింది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

news18-telugu
Updated: November 28, 2019, 12:22 PM IST
ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 17మంది మృతి..
రోడ్డు ప్రమాద దృశ్యాలు
  • Share this:
నేపాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు లోయలో పడిపోయిన ఘటనలో 17మంది మృతి చెందారు.మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.అర్గఖంచి జిల్లాలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన 400మీ. లోయలో పడిపోయింది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల్లో ఆరుగురు పురుషులు,ఐదుగురు స్త్రీలు,ముగ్గురు చిన్నారులు ఉన్నట్టు సమాచారం. మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్లు అద్వాన్నంగా తయారవడం వల్లే తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అక్కడి ప్రజలు వాపోతున్నారు. నవంబర్ 4వ తేదీన జరిగిన ప్రమాదంలోనూ 17మంది మృతి చెందారు. నవంబర్ 3వ తేదీన జరిగిన ప్రమాదంలో 16మంది మృతి చెందారు.

First published: November 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు