ఇండోనేషియాలో కూలిన బంగారు గని..16కి చేరిన మృతుల సంఖ్య

Indonesia gold mine collapse | ఇండోనేషియాలోని అక్రమ బంగారు గని కూలిపోయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరగా...ఈ సంఖ్య మరింత పెరగొచ్చని భావిస్తున్నారు.

news18-telugu
Updated: March 6, 2019, 5:29 PM IST
ఇండోనేషియాలో కూలిన బంగారు గని..16కి చేరిన మృతుల సంఖ్య
ఇండోనేషియా అక్రమ బంగారు గనిలో దుర్ఘటన
news18-telugu
Updated: March 6, 2019, 5:29 PM IST
ఇండోనేషియాలోని సులవేశి దీవిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్న బంగారు గని కూలిపోయిన దుర్ఘటనలో మృతుల సంఖ్య అంతకంతగా పెరుగుతోంది. వారం క్రితం జరిగిన ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు శిథిలాల కింది నుంచి 16 మంది మృతదేహాలను వెలికితీశారు. బంగారు గని శిథిలాల కింద దాదాపు 30 నుంచి 100 మంది వరకు చిక్కుకున్నట్లు ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద నుంచి ఇప్పటి నుంచి 18 మందిని క్షేమంగా బయటకు తీశారు. మరి కొందరు కార్మికులు ప్రాణాలతో ఉండొచ్చన్న ఆశతో రిస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

ఆచూకీ కనిపించని వారి సంఖ్య 60గా అనధికారిక వర్గాల సమాచారం. అయితే అందులో పనిచేసే కార్మికుల సంఖ్యకు సంబంధించి స్థానికులు పరస్పర విరుద్ధమైన సమాచారం ఇస్తున్నారు. దీంతో ఈ సంఖ్యలో అధికారులెవరూ ధృవీకరించడం లేదు. అయితే శిథిలాల కింద పడి మరికొందరు మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనావేస్తున్నారు.

First published: March 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...