అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే Joe Biden చేసే తొలి పని ఇదేనా...

అమెరికా న్యాయ శాఖ 2021 జనవరి 20 లోపు మరో మూడు మరణశిక్షలను అమలు చేయాలని నిర్ణయించింది. అయితే జనవరి 20, 2021 న, జో బిడెన్ యునైటెడ్ స్టేట్స్ 46 వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

news18-telugu
Updated: November 23, 2020, 1:10 AM IST
అమెరికా అధ్యక్ష పదవి చేపట్టగానే Joe Biden చేసే తొలి పని ఇదేనా...
జో బిడెన్ (File)
  • Share this:
అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బిడెన్ తన తొలి సంతకం మరణశిక్ష రద్దుపై చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు, సన్నిహిత వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇఫ్పటికే గత ప్రభుత్వం హయాంలో విచారణ జరిపిన ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించడానికి అమెరికా న్యాయ శాఖ ఇప్పటికే సిద్ధమైంది. కాగా న్యాయ శాఖ 2021 జనవరి 20 లోపు మరో మూడు  మరణశిక్షలను అమలు చేయాలని నిర్ణయించింది. అయితే జనవరి 20, 2021 న, జో బిడెన్ యునైటెడ్ స్టేట్స్  46 వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన బిడెన్ మరణశిక్ష అమలునుపై తొలి నుంచి వ్యతిరేకంగా ఉన్నారు. యుఎస్‌లో మరణ శిక్ష నిబంధనను అంతం చేయడానికి ఆయన గట్టిగా పని చేస్తానని హామీనిచ్చారు. ఇదే విషయాన్ని ఆయన ప్రతినిధి శనివారం  మరోసారి ధృవీకరించారు.

బిడెన్ ప్రెస్ సెక్రటరీ టిజె డకలో మాట్లాడుతూ, "బ్యూరో ఆఫ్ ప్రిజన్స్ గురువారం 17 సంవత్సరాల విరామం తరువాత ఈ సంవత్సరం ఎనిమిదవ ఫెడరల్ మరణశిక్షను అమలు చేసింది." బిడెన్ పరిపాలన ఇప్పుడు, అలాగే భవిష్యత్తులో మరణశిక్షను వ్యతిరేకిస్తుంది. అయితే, బిడెన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మరణశిక్షను ఆపివేస్తారా అనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు.

సమాచారం ప్రకారం, ఆల్ఫ్రెడ్ బూర్జువాకు డిసెంబర్ 11, కోరీ జాన్సన్ డిసెంబర్ 14, డస్టిన్ హిగ్స్ డిసెంబర్ 15 వరకు మరణశిక్ష విధించాలని నిర్ణయించినట్లు న్యాయ శాఖ శుక్రవారం రాత్రి కోర్టుకు తెలిపింది. ఒక మహిళతో సహా మరో రెండు మరణశిక్షలు ఈ సంవత్సరానికి షెడ్యూల్ చేయబడ్డాయి. ఈ నేపథ్యంలో బిడెన్ తీసుకునే నిర్ణయం చాలా కీలకంగా మారనుంది.
Published by: Krishna Adithya
First published: November 23, 2020, 1:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading