పోర్న్ వీడియోలకు సబ్ టైటిల్స్ ఏవి?... కోర్టుకెక్కిన యువకుడు...

ప్రతీకాత్మక చిత్రం

బదిరుల (చెవిటి, మూగ దివ్యాంగులు) కోసం వార్తలుండటం సహజం. వేర్వేరు భాషల సినిమాలకు సబ్ టైటిల్స్ ఉండటం కామన్. కానీ పోర్నోగ్రఫీ వీడియోలకు సబ్ టైటిల్ ఉండాలంటే ఎలా?

  • Share this:
    ఇలాంటి విచిత్రమైన కేసులు ఈ రోజుల్లో నమోదవుతుండటం ఆశ్చర్యకరమే. డబ్బింగ్ సినిమాలకు... కింద సబ్ టైటిల్స్ వేస్తారు కదా... అదే విధంగా పోర్నోగ్రఫీ (బూతు వీడియోలు) వీడియోలకు కూడా సబ్ టైటిల్స్ వెయ్యాలంటూ... కోర్టు మెట్లెక్కాడు ఓ యువకుడు. అమెరికా... న్యూయార్క్‌లోని దివ్యాంగుడైన యారోస్లావ్ సూరిస్... బ్రూక్‌లిన్‌ ఫెడరల్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. చెవిటివాడైన అతను... పోర్న్‌హబ్ వెబ్‌సైట్ (పోర్నోగ్రఫీని చూపించే వెబ్‌సైట్)లో సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నాడు. అందులో వీడియోల్ని చూస్తుంటే... చెవిటితనం వల్ల తాను ఎంజాయ్ చెయ్యలేకపోతున్నాననీ... ఆ వీడియోలకు సబ్ టైటిల్స్ ఉండాలని డిమాండ్ చేస్తున్నాడు. సాధారణ ప్రజలు అలాంటి వీడియోలు చూసి... వాటిలో డైలాగ్స్ ఇతరత్రా వింటూ... ఎంజాయ్ చేస్తున్నా్రనీ... మరి బదిరులమైన తామెందుకు ఆ ఎంజాయ్‌మెంట్ కోల్పోవాలని ప్రశ్నిస్తున్నాడు. తాము సబ్ టైటిల్స్ పొందాలంటే... ప్రీమియం మెంబర్‌షిప్ కలిగి ఉండాలనే కండీషన్ పెడుతున్నారనీ... అది వివక్షా పూరితం అని అంటున్నాడు. పోర్న్‌ వీడియోలు ప్రసారం చేసే పోర్న్‌హబ్‌, రెడ్‌ట్యూబ్‌, యూపోర్న్‌, మైండ్‌గ్రీక్ వంటి వెబ్‌సైట్లు తమపై వివక్షత చూపుతున్నాయని కేసు పెట్టాడు. అమెరికా దివ్యాంగుల చట్టం ప్రకారం... తమకు అన్యాయం జరుగుతోందని పిటిషన్‌లో తెలిపాడు. ఇందుకు సంబంధించి మొత్తం 23 పేజీల పిటిషన్ వేశాడు.

    ఐతే... పోర్న్‌హబ్ వెబ్‌సైట్ యాజమాన్యం ఇలాంటి కేసులు వస్తాయని ముందే ఊహించి జాగ్రత్త పడింది. తమ వెబ్‌సైట్‌లో క్లోజ్‌డ్ కాప్షన్ ఆప్షన్ ఉందని చెప్పింది. దాన్ని ఎంచుకుంటే... సబ్ టైటిల్స్ వస్తాయని తెలిపింది. ఆ ఆప్షన్ ఎంచుకునేందుకు ప్రీమియం మెంబర్‌షిప్ ఉండాలో అక్కర్లేదో మాత్రం వివరించలేదు. సబ్ టైటిల్స్‌తో 1000కి పైగా వీడియోలు ఉన్నాయనీ... వాటిలో టెక్ట్స్ మెసేజ్‌తోపాటూ... ఇతరత్రా శబ్దాల వివరాలు కూడా ఉన్నాయని చెప్పింది. అమెరికాలో 18 ఏళ్లకు పైగా వయసున్న 15 శాతం మంది... అంటే... 3కోట్ల 75 లక్షల మంది చెవిటి సమస్యతో బాధపడుతున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: