White House: ట్రంప్‌న‌కు ప్రాణంతాక విషంతో కూడిన పార్సిల్..!

అమెరికా అధ్యక్షుడికి డోనాల్డ్ ట్రంప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన పార్సిల్‌ను పంపించారు. ట్రంప్ పేరిట వైట్ హౌస్ చిరునామాకు వచ్చిన ఈ పార్సిల్‌ను స్క్రీనింగ్ సమయంలో అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు.

news18-telugu
Updated: September 20, 2020, 9:52 AM IST
White House: ట్రంప్‌న‌కు ప్రాణంతాక విషంతో కూడిన పార్సిల్..!
డోనాల్డ్ ట్రంప్(ఫైల్ ఫొటో)
  • Share this:
అమెరికా అధ్యక్షుడికి డోనాల్డ్ ట్రంప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన పార్సిల్‌ను పంపించారు. ట్రంప్ పేరిట వైట్ హౌస్ చిరునామాకు వచ్చిన ఈ పార్సిల్‌ను స్క్రీనింగ్ సమయంలో అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. ఆ తర్వాత పార్శిల్‌లోని పదార్థాలను ప్రాథమికంగా పరిశీలించగా అందులో ప్రాణంతక రిసిన్ విష పదార్థం ఉన్నట్టు తేలింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే ట్రంప్ పేరిట ఓ అనుమానిత పార్సిల్ వచ్చిందని లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ పార్సిల్ ఎవరు పంపారో తెలుసుకోవడానికి.. ఎఫ్‌బీఐ, సీక్రెట్ సర్వీస్ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి. కెనడా నుంచి ఈ పార్సిల్ వచ్చినట్టుగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

ఇక, రిసిన్ అనే అత్యంత ప్రభావం గల ఈ విషపదార్థాన్ని ఉగ్రదాడుల సమయంలో వినియోగిస్తారు. రిసిన్ అనేది ఆముదపు గింజల్లో సహజంగా నిక్షిప్తమై ఉంటుంది. ఆముదపు గింజలను శుద్ది చేసిన తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థాల నుంచి రిసిన్‌ను తయారు చేస్తారు. కొన్ని రసాయనిక ప్రక్రియల ద్వారా దీన్ని గింజల నుంచి వేరుచేస్తారు. ఈ పాయిజన్‌ను వివిధ రూపాల్లో ఉంటుంది. దీనిని యాసిడ్‌గా, పౌడర్‌గా, ద్రవంగా ఉపయోగిస్తారు. ఈ పాయిజన్‌ను ఎవరైనా తీసుకుంటే.. వారికి వెంటనే వాంతులు అవుతాయి.

కాగా, వైట్‌హౌస్‌కు వచ్చే లెటర్లు, ప్యాకేజీలను లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ముందుగా ఆఫ్‌సైట్ ఫెసిలిటీలో తనిఖీ చేపడతారు. గతంలో కూడా వైట్‌హౌస్ అడ్రస్‌కు ఇటువంటి లేఖలు, పార్సిల్స్ వచ్చిన సంగతి తెలిపిందే.
Published by: Sumanth Kanukula
First published: September 20, 2020, 9:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading