ఇరాన్‌లో భారీ భూకంపం.. ఐదుగురు మృతి..

భూకంపం కారణంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు. భూగర్భంలో 5కి.మీ లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు.

news18-telugu
Updated: November 8, 2019, 2:03 PM IST
ఇరాన్‌లో భారీ భూకంపం.. ఐదుగురు మృతి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శుక్రవారం ఉదయం ఇరాన్ భూకంపంతో వణికిపోయింది. అజర్‌బైజాన్ పరిధిలోని తాబ్రిజ్ నగరానికి 120కి.మీ దూరంలో భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.9గా నమోదైంది. భూకంపం కారణంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు. భూగర్భంలో 5కి.మీ లోపల భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అధికారులు తెలిపారు.భూకంపాన్ని ముందే అంచనా వేసిన యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే.. దీనిపై హెచ్చరికలు జారీ చేసింది.

కాగా,2003లో ఇరాన్‌లో సంభవించిన భూకంపం 31000మందిని బలితీసుకుంది. 1990లో సంభవించిన భూకంపం 40వేల

మందిని బలితీసుకుంది. ఈ విపత్తులతో ఇరాన్‌ తీవ్రంగా నష్టపోయింది. 2005,2012లో సంభవించిన భూకంపాల్లో దాదాపు 900 మంది మృతి చెందారు.2017లో సంభవించిన భూకంపం కారణంగా 600 మంది మృతి చెందారు.కొన్ని వేల మంది నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. వరుస భూకంపాలతో ఇరాన్ అన్ని విధాలుగా నష్టపోతోంది.

First published: November 8, 2019, 2:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading