చనిపోయిన నెల రోజులకి ఎన్నికల్లో గెలిచాడు...

ప్రత్యర్థిపై 68 శాతం ఓట్ల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించిన డెన్నిస్ హోఫ్... వేశ్యాగృహ యజమానికి భారీగా ఓట్లు... ఫలితాల ప్రకటనకు నెల ముందే మరణించిన ‘ట్రంప్ ఫ్రమ్ ఫరంప్’!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 8, 2018, 7:11 PM IST
చనిపోయిన నెల రోజులకి ఎన్నికల్లో గెలిచాడు...
డెన్నిస్ హోఫ్ (Image: Reuters)
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: November 8, 2018, 7:11 PM IST
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో చిత్రమైన సంఘటన జరిగింది. ఇప్పటికే విడుదలైన ఫలితాల్లో మొట్టమొదటిసారిగా ఇద్దరు ముస్లిం మహిళలు, ఓ లెస్బియన్ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా నెల రోజుల క్రితం మరణించిన ఓ అభ్యర్థి... తాజాగా ప్రకటించిన ఫలితాల్లో విజయభావుటా ఎగురవేయడంతో అందరూ ఆశ్చర్యంతో పాటు జాలి పడుతున్నారు. రిప్లబికన్ పార్టీ అభ్యర్థి, ఓ వేశ్యాగృహానికి యజమాని అయిన డెన్నిస్ హోఫ్ అనే వ్యక్తి, నెవడాలోని 36వ అసెంబ్లీ డిస్ట్రిక్ నుంచి పోటీ చేసి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి లెసియా రోమనోవ్‌పై 68 శాతం ఓట్ల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించాడు.

అయితే 72 ఏళ్ల డెన్నిస్ హోఫ్ కొన్నాళ్ల క్రితం మరణించాడు. పుట్టినరోజు నాడే ఆయన చనిపోవడం విశేషం. నెవడాలోని క్రిస్టల్‌లోని తన నివాసంలో డెన్నిస్ హోఫ్ మృతదేహం లభ్యమైంది. పుట్టినరోజు వేడుకలు నిర్వహించే ఉద్దేశంతో ఆయనకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు స్నేహితులు డెన్నిస్ ఇంటికి వెళ్లి లేపేందుకు ప్రయత్నించారు. కానీ డెన్నిస్ ఎంతకీ లేవకపోవడంతో డాక్టర్లకు సమాచారం అందించారు. డెన్నిస్ హోఫ్ నిద్రలోనే మరణించినట్టు డాక్టర్లు ఖరారు చేశారు. దాదాపు నెల రోజుల తర్వాత ప్రకటించిన ఫలితాల్లో డెన్నిస్ హోఫ్ ఘనవిజయం సాధించడం ఆయన అభిమానులను శోకసంద్రంలో పడేసింది.

‘స్ట్రిప్ క్లబ్’ పేరుతో ఓ వైశ్య గృహాన్ని నడుపుతున్నాడు డెన్నిస్ హోఫ్. అయితే అమెరికాలో బ్రోతల్ హౌస్ నిర్వహించడం నేరం కాదు. ఆయన వేశ్య గృహంలో వందల మంది వేశ్యలు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ లాగే తన పొలిటికల్ కెరీర్ చాలా బాగుందని అన్నారు. ‘ట్రంప్ ఫ్రమ్ ఫరంప్’గా తనకి తాను నిక్‌నేమ్ కూడా పెట్టుకున్నాడు డెన్నిస్ హోఫ్. డెన్నిస్ హోఫ్ మరణంతో అమెరికన్ ఎలక్షన్స్ రూల్స్ ప్రకారం అతను పోటీ చేసిన రిప్లబికన్ పార్టీ నుంచే మరొకరిని అతని స్థానంలో నిలబడతారు అధికారులు.

First published: November 8, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...