Home /News /international /

DAY AFTER IRAN FIRES MISSILES AT IRAQI BASES 2 ROCKETS HIT BAGHDADS GREEN ZONE THAT HOUSES US EMBASSY NK

అమెరికా లక్ష్యంగా ఇరాన్ రాకెట్ దాడులు... ఇరాక్‌లో అల్లకల్లోలం

ఇరాన్ (File)

ఇరాన్ (File)

Iran : ఖాసిం సులేమానీ హత్యతో రగిలిపోతున్న ఇరాన్... రాకెట్ దాడులు చేస్తోంది. మరి అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? దెబ్బకి దెబ్బ తీస్తుందా?

    Iran : అమెరికా, ఇరాన్, ఇరాక్... ఈ మూడు దేశాల్లోనూ ఎన్నో సమస్యలున్నాయి. వాటి పాలకులు ఆ సమస్యల్ని పక్కన పెట్టేసి... యుద్ధం... యుద్ధం అంటున్నారు. అమెరికా రెచ్చగొడుతుంటే... ఇరాన్ రెచ్చిపోతోంది. ఈ రెండు దేశాల యుద్ధానికీ ఇరాక్ కేరాఫ్ అడ్రెస్ అవుతోంది. నిన్న అమెరికా లక్ష్యంగా దాడులు చేసిన ఇరాన్... ఇవాళ కూడా రెండు రాకెట్లతో ఇరాక్‌పై విరుచుకుపడింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్‌పై పడ్డాయి ఆ రాకెట్లు. అక్కడే అమెరికా రాయబార కార్యాలయం సహా చాలా దేశాల ఏంబసీలు ఉన్నాయి. అత్యంత సెక్యూరిటీ ఉండే ప్రదేశం అది. రాకెట్ల దాడి జరిగిన వెంటనే... అక్కడ పెద్ద ఎత్తున సెక్యూరిటీ సైరన్స్ మోగాయి. అంతకుముందు రోజే... ఇరాక్‌లోని అమెరికా, సంకీర్ణ దళాలు ఉండే ప్రాంతంలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు పాల్పడింది. ఐతే... ఆ దాడిలో అమెరికన్లు ఎవరూ చనిపోలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. తాము యుద్ధం చేయాలనుకోవట్లేదనీ... అమెరికాకు అణుబాంబును చిక్కకుండా చేస్తామని అన్నారు.


    గతవారం... అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో... ఇరాన్ జనరల్ ఖాసిం సొలేమానీ, ఇరాక్ కమాండర్ అబు మహ్దీ అల్ ముందీస్ చనిపోయారు. అప్పటి నుంచీ ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్... అమెరికా లక్ష్యంగా ఇరాక్‌లోని అమెరికా స్థావరాలు, కార్యాలయాలపై దాడులు చేస్తోంది. ఈ తాజా దాడులపై అమెరికా ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు టెన్షన్ తెప్పించే అంశం. అసలే ట్రంప్ చూస్తూ ఊరుకునే రకం కాదు. ఒక్క ఆర్డర్ వేశారంటే చాలు... ఇరాక్‌లోని అమెరికా దళాలు ఆపరేషన్ మొదలుపెట్టేస్తాయి. ప్రస్తుతం ఇరాన్ ప్రజలు... అమెరికా అంటే పీకల దాకా కోపం, ఆవేశంతో ఉన్నారు. యుద్ధం చేసే ఉద్దేశం లేదని ట్రంప్ చెప్పినా... ఇరాన్ మరోసారి దాడి చేసింది కాబట్టి... అమెరికా చూస్తూ ఊరుకుంటుందని అనుకోలేం. ఈ పరిస్థితి వల్ల ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. బంగారం రేట్లు పెరిగిపోతున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Iran, Iraq, USA

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు