• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • DAY AFTER ADMITTING MASOOD AZHAR IS IN PAK FOREIGN MINISTER SAYS GOVT IN TOUCH WITH JAISH LEADERSHIP MS

జైషే చీఫ్‌ అజర్‌తో మా ప్రభుత్వం టచ్‌లోనే ఉంది : పాక్ విదేశాంగ మంత్రి ఖరేషీ

జైషే చీఫ్‌ అజర్‌తో మా ప్రభుత్వం టచ్‌లోనే ఉంది : పాక్ విదేశాంగ మంత్రి ఖరేషీ

పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ(File)

ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై ఆత్మాహుతి దాడి అనంతరం.. ఇది తమ పనే అని వీడియో ద్వారా జైషే మహమ్మద్ ప్రకటించింది. అంతేకాదు తాము ఎప్పుడైనా దాడి చేయడానికి సిద్దంగా ఉన్నామని అందులో పేర్కొంది.

  • Share this:
    పుల్వామా ఉగ్రదాడి తమ పనే అంటూ జైషే మహమ్మద్ ప్రకటించినా.. పాకిస్తాన్ మాత్రం ఇంకా ఆ సంస్థను వెనకేసుకొస్తూనే ఉంది. దాడికి పాల్పడింది జైషే మహమ్మద్ అని చెప్పడానికి తగిన ఆధారాల్లేవని పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ అంటున్నారు. భారత్ సరైన ఆధారాలు చూపిస్తే తప్ప ఈ విషయంలో జైషే మహమ్మద్‌పై ఎటువంటి చర్యలు తీసుకోలేమని అంటున్నారు.

    జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఒప్పుకున్న మరుసటి రోజే.. తమ ప్రభుత్వం ఆయనతో టచ్‌లో ఉన్నట్టు పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ చెప్పడం గమనార్హం. ఓవైపు భారత్ సహా ఫ్రాన్స్, అమెరికా దేశాలు మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ ఐరాసపై ఒత్తిడి తెస్తుంటే.. పాక్ మాత్రం అతన్ని వెనకేసుకొస్తున్నట్టుగా వ్యవహరిస్తోంది. మసూద్ అజర్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని.. ప్రస్తుతం అతను ఇల్లు కదల్లేని పరిస్థితిలో ఉన్నాడని గురువారం ఖురేషీ మీడియాతో వెల్లడించారు.


    ఫిబ్రవరి 14న పుల్వామాలో భారత జవాన్లపై ఆత్మాహుతి దాడి అనంతరం.. ఇది తమ పనే అని వీడియో ద్వారా జైషే మహమ్మద్ ప్రకటించింది. అంతేకాదు తాము ఎప్పుడైనా దాడి చేయడానికి సిద్దంగా ఉన్నామని అందులో పేర్కొంది. జైషే మహమ్మద్ స్వయంగా నేరాన్ని ఒప్పుకున్నప్పటికీ.. పాకిస్తాన్ మాత్రం భారత్ తగిన ఆధారాలు చూపిస్తేనే దీనిపై విచారణ జరుపుతామని చెబుతోంది.

    ఇది కూడా చదవండి : జైషే చీఫ్ మసూద్ పాక్‌లోనే ఉన్నాడు.. కానీ..: పాకిస్తాన్ విదేశాంగ మంత్రి
    Published by:Srinivas Mittapalli
    First published: