Melinda - Billgates : విడిపోయినా కలిసి వచ్చారు.. ప్రియుడితో కేథరిన్ గేట్స్ వివాహం.. హజరైన బిల్‌గేట్స్...

Melinda - Billgates : విడిపోయినా కలిసి వచ్చారు.. ప్రియుడితో కేథరిన్ గేట్స్ వివాహం..

Melinda - Billgates : బిల్‌గేట్స్‌-మిలిందా గేట్స్‌ల కుమార్తె జెన్నీఫర్‌ కేథరిన్‌ గేట్స్‌ వివాహం సీక్రెట్‌గా జరిగిపోయింది. తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్‌ రైడర్‌ అయిన నాయెల్‌ నాజర్‌తో జెన్నిఫర్‌ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన 'పీపుల్‌' మ్యాగజైన్‌ ధృవీకరించింది.

  • Share this:
    బిల్‌గేట్స్‌-మిలిందా గేట్స్‌ల కుమార్తె జెన్నీఫర్‌ కేథరిన్‌ గేట్స్‌ వివాహం సీక్రెట్‌గా జరిగిపోయింది. తన స్నేహితుడు, ప్రియుడు, హార్స్‌ రైడర్‌ అయిన నాయెల్‌ నాజర్‌తో జెన్నిఫర్‌ పెళ్లి జరిగినట్లు అమెరికాకు చెందిన 'పీపుల్‌' మ్యాగజైన్‌ ధృవీకరించింది.

    కొన్ని నెలల క్రితం మిలిందా,బిల్ గేట్స్‌తో ( melinda , Billgates) విడాకులు తీసుకున్నతీసుకున్న విషయం తెలిసందే.. అయితే.. బిల్‌గేట్స్‌.. కుమార్తె జెన్నీఫర్‌ వివాహ వేడుకకు ( marriage ) ఒకరోజు ముందుగానే హాజరయ్యారు. కాగా, కుమార్తె వివాహానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను తల్లి మిలిందా దగ్గరుండి చూసుకున్నట్టు తెలిపారు. కాగా వివాహ వేడుకకు ( marriage function ) అతికొద్ది మంది బంధువుల సమక్షంలోనే జెన్నీఫర్‌-నాజర్‌ల పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో అమెరికా ( america ) తరఫున నాజర్‌ ‌గుర్రపు స్వారీ లో పాల్గొన్నాడు.

    ఇది చదవండి : హైదరాబాద్‌లో టీ బాగా కాస్లీ గురు.. కప్పు చాయ్ 1000 రూపాయలట..!


    ఈజిప్టు సంతతికి చెందిన నాయల్‌ నాజర్‌ది సంపన్న కుటుంబమే. వీరిద్దరూ చాలా కాలం క్రితం నుంచే డేటింగ్‌లో (Dating ) ఉన్నారట. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో వీరిద్దరి కలిసి చదువుకుంటున్న సమయంలో ప్రేమ చిగురించినట్టు సమచారం. చివరకు సోషల్‌ మీడియా ( Social media ) వేదికగా జెన్నీఫర్‌ తన ప్రేమ వివాహాన్ని గతేడాదే బైటపెట్టింది. ఆ సమయంలో వీరి ప్రేమకు బిల్‌గేట్స్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దానిలో భాగంగానే వీరి పెళ్లికి బిల్‌గేట్స్‌తో పాటు మాజీ భార్య మిలిందాలు దగ్గరుండి జరిపించినట్లు ఆ మ్యాగజైన్‌ తెలిపింది.

    ఇది చదవండి : World corona deaths : 50 లక్షలకు చేరువలో కరోనా మరణాలు.. అమెరికా ఫస్ట్..భారత్ సెకండ్ ప్లేస్...


    బిల్‌గేట్స్‌-మిలిందా మే 4న విడాకులు ప్రకటించిన తర్వాత అది ప్రపంచ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఉండలేక విడిపోవడానికే మొగ్గుచూపడంతో అది విడాకులకు దారి తీసింది. దాంతో మిలిందాతో 27 ఏళ్ల వైవాహిక జీవితానికి బిల్‌గేట్స్‌ ముగింపు పలికినట్లు అయ్యింది. కాగా, బిల్‌గేట్స్‌ దంపతులకు ( Gates family ) ముగ్గురు సంతానం. జెన్నీఫర్‌ గేట్స్‌, రోరీ గేట్స్‌, ఫీబీ అడెల్‌ గేట్స్‌. అందరి కంటే పెద్ద అమ్మాయే జెన్నీఫర్‌ గేట్స్‌. ఈమె అంటే తల్లి మిలిందాకు చాలా ఇష్టమట.

    ఇది చదవండి : కష్టాల్లో ఉన్నాం ఆదుకోండంటూ భారత్​ను అర్థించిన శ్రీలంక.. అప్పుగా 50 కోట్ల డాలర్లు ఇవ్వాలంటూ వేడుకోలు

    Published by:yveerash yveerash
    First published: