Home /News /international /

DANISH BANK OFFERS 20 YEAR HOME LOAN WITH 0 PERCENT INTEREST RATE HSN

Home Loan: వావ్.. 0 శాతం వడ్డీకే హోమ్ లోన్, 20 ఏళ్ల కాల పరిమితి.. ఆ బ్యాంక్ బంపరాఫర్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా హోమ్ లోన్ వడ్డీ రేటు 7 శాతం నుంచి 15 శాతం వరకు ఉంటుంది. కొన్ని కొన్ని ప్రైవేటు బ్యాంకులయితే 20శాతం వరకు కూడా వడ్డీని తీసుకుంటున్నాయి. కానీ ఓ బ్యాంకు వడ్డీ లేని రుణం.. అచ్చంగా 0శాతం వడ్డీతో హోమ్ లోన్ ఇస్తోందని మీకు తెలుసా..? అది కూడా ఏకంగా 20 ఏళ్ల కాల వ్యవధిలో సింపుల్ ఈఎమ్ఐతో చెల్లించేలా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరి ఆ బ్యాంక్ ఏదో..? అది ప్రకటించిన ఆఫర్ ఏంటో ఓ లుక్కేయండి..

ఇంకా చదవండి ...
    చదువు పూర్తవగానే జాబ్ గురించి టెన్షన్. ఉద్యోగం కూడా వచ్చేశాక పెళ్లి గురించి మెంటన్ ప్రెజర్. అదీ కూడా పూర్తయి ఓ పాబో, బాబో కలిగాక మరో టెన్షన్. అదేనండీ సొంతింటి గురించి ఆలోచనలు. తల్లిదండ్రులు కాస్తో కూస్తో సంపాదించి కొడుకులకు ఇళ్లు కట్టించి ఇస్తే ఫరవా లేదు. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఒకవేళ తల్లిదండ్రులు ఇల్లు కట్టించి ఇచ్చినా, అది సొంతూళ్లో ఉంటుందే తప్ప సిటీలో ఉండదు. ఉద్యోగరీత్యా ప్రస్తుత తరమంతా నగరాల్లో తిష్ట వేసుకుని కూర్చుంది. కాబట్టి సిటీలో సొంతిల్లు కావాలంటే కచ్చితంగా ప్రస్తుత తరానికి ఓ సవాల్ లాంటిదే. అద్దె ఇంట్లో ఉంటూ నెలకు వేలకు వేలు యజమానులకు ఇచ్చే బదులు, బ్యాంక్ లోన్ తీసుకుని యజమానులకు ఇచ్చేది ఏదో ఈఎమ్ఐ రూపంలో బ్యాంకుకు చెల్లిస్తే 20, 30 ఏళ్లు తిరిగొచ్చేసరికి సొంతిల్లు మన చేతిలో ఉంటుంది కదా అన్నది ప్రస్తుత తరం ఆలోచన.

    అందుకే ప్రస్తుతం అంతా హోమ్ లోన్ గురించి తెగ ఆలోచన చేస్తున్నారు. అన్ని బ్యాంకుల గురించి ఆరా తీసి ఎక్కడ వడ్డీ తక్కువగా ఉంటుంది.? ఎక్కడ సులభమైన రీతిలో , తక్కువ వడ్డీకే హోమ్ లోన్ వస్తుంది..? అన్న విషయాల గురించి తెగ వెతికేస్తున్నారు. తెలిసిన వారి వద్ద ఆరా తీస్తున్నారు. సాధారణంగా హోమ్ లోన్ వడ్డీ రేటు 7 శాతం నుంచి 15 శాతం వరకు ఉంటుంది. కొన్ని కొన్ని ప్రైవేటు బ్యాంకులయితే 20శాతం వరకు కూడా వడ్డీని తీసుకుంటున్నాయి. కానీ ఓ బ్యాంకు వడ్డీ లేని రుణం.. అచ్చంగా 0శాతం వడ్డీతో హోమ్ లోన్ ఇస్తోందని మీకు తెలుసా..? అది కూడా ఏకంగా 20 ఏళ్ల కాల వ్యవధిలో సింపుల్ ఈఎమ్ఐతో చెల్లించేలా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. మరి ఆ బ్యాంక్ ఏదో..? అది ప్రకటించిన ఆఫర్ ఏంటో ఓ లుక్కేయండి..

    మన బ్యాంకుల్లో హోమ్ లోన్ కావాలంటే సవాలక్ష పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మన జీతం, చెల్లించగలిగే కెపాసిటీ, ఆస్తులు ఏమైనా ఉన్నాయా..? బంగారం ఎంత ఉంది.? ఇంట్లో ఎంత మంది పనిచేస్తారు.?పిల్లలు ఎంత మంది.? ఇతర లోన్లు ఏమైనా ఉన్నాయా.? ఇలా, అనేక అంశాల గురించి ఆరా తీసి బ్యాంకులు లోన్ మంజూరు చేస్తుంటాయి. లోన్ కావాల్సిన వాళ్లు 30 లక్షలో, 40 లక్షలో అడిగినా, తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉందన్న కారణంతో 20 లక్షలో, 25లక్షలో రుణం మంజూరు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. 20 ఏళ్లు, 25 ఏళ్లు, 30 ఏళ్లు.. ఇలా కస్టమర్ ఎంచుకున్న కాల పరిమితిని బట్టి చెల్లించే మొత్తం మారిపోతుంది. ఒక వ్యక్తి 25 లక్షల లోన్ తీసుకుంటే అతడు 25 ఏళ్ల కాలపరిమిలో బ్యాంకుకు చెల్లించేది 50 లక్షల వరకు కూడా ఉండొచ్చు. అది వడ్డీ రేటును బట్టి ఉంటుంది. అందుకే వడ్డీ రేటు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ లోన్ తీసుకోవడానికి కస్టమర్లు ఆసక్తి చూపుతుంటారు. ఓ బ్యాంకు ఏకంగా 0శాతం వడ్డీతో 20 ఏళ్ల పాటు కస్టమర్ తిరిగి చెల్లించేలా వెసులుబాటు ఇచ్చింది. అది మన దేశంలోని బ్యాంకు కాదులేండి. యూరప్ లోని డెన్మార్క్ లో ది నోరెడా బ్యాక్ ఇచ్చిన సంచలన ఆఫర్ ఇది.

    వాస్తవానికి డెన్మార్క్ లోని బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తక్కువగానే ఉంటాయి. డెన్మార్క్ లోని జైస్కే బ్యాంక్ మొదట 10 ఏళ్ల కాలపరిమితితో 0.5శాతం వడ్డీతో హోమ్ లోన్ ను ఇవ్వడం ప్రారంభించింది. తాజాగా నోరెడా బ్యాంక్ దాన్ని 20 ఏళ్ల కాలపరిమితికి పెంచుతూ 0శాతాన్ని వడ్డీ రేటుగా నిర్ణయిస్తూ కీలక ప్రకటన చేశారు. దీంతో హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్న వారు ఆ బ్యాంక్ ముంగిట క్యూ కడుతున్నారు. మరి మన భారత్ లో కూడా ఇలాంటి తక్కువ వడ్డీకి ఇచ్చే బ్యాంకులు ఉంటే ఎంతో మేలు కదూ..
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Banks, Car loans, Home loan, National

    తదుపరి వార్తలు