DALAI LAMA THE DALAILAMA SAID SOME IN CHINA WOULD BE MORE DOMINANT IT IS SAID TO BE VERY CALM IN INDIA EVK
Dalai Lama: చైనాలో వారి ఆధిపత్యమే ఎక్కువ.. భారత్‌లో ప్రశాంతంగా ఉంటుంది: దలైలామా
దలైలామా (ఫైల్)
Dalai Lama:చైనా (China) పై బౌద్ధ గురువు దలైలామా విమర్శలు చేశారు. భిన్న సం ప్రదాయాల ప్రాముఖ్య చైన ఎప్పటికీ అర్థం చేసుకోలేరిని ఆయన అన్నారు. ముఖ్యంగా చైనాలో హన్‌వర్గం ఆధిపత్యం, నియం త్రణే ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. చైనాపై వ్యక్తిగతంగా నాకు వ్యతిరేకత లేదని దలైలామా అన్నారు.
చైనా (China) పై బౌద్ధ గురువు దలైలామా (Dalai Lama) విమర్శలు చేశారు. భిన్న సం ప్రదాయాల ప్రాముఖ్య చైన ఎప్పటికీ అర్థం చేసుకోలేరిని ఆయన అన్నారు. ముఖ్యంగా చైనాలో హన్‌వర్గం ఆధిపత్యం, నియం త్రణే ఎక్కువగా ఉంటుందని ఆయన అన్నారు. చైనాపై వ్యక్తిగతంగా నాకు వ్యతిరేకత లేదని దలైలామా అన్నారు. భారత్‌లో చాల భిన్నమైన వాతావరణం ఉంటుందని అన్నారు. ఇక్కడా చాలా ప్రశాంతంగా ఉంటుందని ఆయన అన్నారు. మతసామరస్యం లో భారత్ ప్రపంచానికే భారత్ ఆదర్శంగా నిలుస్తోందని దలైలామా అన్నారు. ఆయన శ్రీలంక (Sri Lanka) న్ టిబెటన్ బుద్ధిస్ట్ సొసైటీ ఏర్పాటు చేసిన ఓ కార్య క్రమంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. వేల ఏళ్లుగా భారత్ అహిం సా మార్గాన్ని అనుసరిస్తోందని కొనియాడారు. కార్యక్రమంలో ఇండోనేషియా, మలేసియా, భారత్, మయన్మార్, శ్రీలం క, థాయిలాండ్‌కు చెందిన బౌద్ధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దలైలామా మాట్లాడుతూ.. భారతీయ మత సం ప్రదాయం అహిం సను బోధిస్తుందని అన్నారు. భారత్‌లో అహింసా, కరుణా అనేవి 3వేల ఏళ్లుగా పాటిస్తున్నారని కొనియడాడారు. ఇస్లాం, క్రిష్టియానిటీ, జైనులు, యూదులులతోపాటు ప్రపంచంలోని ఎన్నో మతాలకు చెందిన వారు ఇక్కడ ఎంతో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని అన్నారు.
గతంలోనూ దలైలామ భారత్‌గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను నేర్చుకున్న జ్ఞానం, విజ్ఞానమంతా భారత్ నుంచి సంపాదించుకున్నదేనని టిబెటిన్ ఆధ్యాత్మిక గురువు దలైలామా గతంలో పలుమార్లు చెప్పారు.
‘ప్రాచీన విజ్ఞానాన్ని నేను మీనుంచే నేర్చుకున్నాను’ అని తరచూ భారతీయులతో తాను అంటూ ఉంటానని గుర్తుచేసుకున్నారు. భారత విద్యా వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచానికి ప్రాచీన విజ్ఞానం అందించింది భారత దేశామేనని దలైలామా చాలా సార్లు కొనియాడారు. ప్రాచీన విజ్ఞాన మాతృదేశమైన భారత్‌లో...నేటి చిన్నారులకు బోధించాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయన్నారు. ప్రస్తుత విద్యావవస్థలో భారత ప్రాచీన విజ్ఞానాన్ని పాఠ్యాంశంగా చేరిస్తే చిన్నారుల మానసికపరమైన వికాసానికి ఆస్కారం ఉంటుందన్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.