110 సంవత్సరాలు బతకుతానని కలలో దేవత చెప్పింది...దలైలామా కాలజ్ఞానం...

తనకు కలలో ధర్మరక్షుకులైన దేవతల్లో ఒకరైన పాల్ డెన్ లామో కలలో కనిపించి, తాను 110 సంవత్సరాలు జీవితం కొనసాగిస్తానని చెప్పిందని అన్నారు. అలాగే భవిష్యత్తులో జరిగే కొన్ని పరిణామాలను సైతం దలైలామా అందులో వివరించారు.

news18-telugu
Updated: August 27, 2019, 7:00 PM IST
110 సంవత్సరాలు బతకుతానని కలలో దేవత చెప్పింది...దలైలామా కాలజ్ఞానం...
దలైలామా (ఫైల్ చిత్రం)
  • Share this:
గత కొంతకాలంగా అస్వస్థతతో చికిత్స పొందుతున్న బౌద్ధ మతగురువు దలైలామా తన భక్తులను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు. అందులో తాను ఆరోగ్యంగా ఉన్నానని, 110 సంవత్సరాలు బతుకుతానని దలైలామా కాలజ్ఞానం ఆధారంగా ప్రకటన చేశారు. దీంతో ఆయన భక్తులు హర్షం వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా దలైలామా ఛాతీలో ఇన్ ఫెక్షన్ కారణంగా చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే భక్తులు ఆందోళన చెందకుండా వీడియో విడుదల చేశారు. అంతేకాదు తనకు కలలో ధర్మరక్షుకులైన దేవతల్లో ఒకరైన పాల్ డెన్ లామో కలలో కనిపించి, తాను 110 సంవత్సరాలు జీవితం కొనసాగిస్తానని చెప్పిందని అన్నారు. అలాగే భవిష్యత్తులో జరిగే కొన్ని పరిణామాలను సైతం దలైలామా అందులో వివరించారు. అలాగే తనకు చికిత్స చేయడంలో సహకరించిన భారతప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. తన ఆరోగ్యంపై వచ్చే పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే 84 సంవత్సరాల దలైలామా టిబెట్ నుంచి భారత్ కు తరలివచ్చి శరణార్థిగా ఉన్నారు. ధర్మశాల నుంచి టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని ఆయన నడుపుతున్నారు. బౌద్ధమతానికి చెందిన మతగురువుగా పేరొందిన దలైలామాకు ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయర్లు ఉన్నారు.

First published: August 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>