Cylinder explosion: పాకిస్థాన్... గురుజన్‌వాలాలో... గ్యాస్ సిలిండర్ పేలి... 10 మంది చనిపోయారు. స్పాట్‌లోనే 9 మంది చనిపోగా... గాయపడిన వారిని ఆస్పత్రికి తీసుకెళ్లగా... వారిలో ఒకరు తీవ్ర గాయాలు తట్టుకోలేక ప్రాణాలు విడిచారు. ఓ వ్యాన్ వెనకవైపు ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఇలా సిలిండర్ పేలుతుందని ఎవరూ ఊహించరు కదా... వ్యాన్‌లో ఉన్న వారికి తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. గాయపడిన వారిని DHQ ఆస్పత్రికి తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.
ప్రాథమిక దర్యాప్తులో ఓ విషయం తెలిసింది. ఆదివారం రాత్రి ఈ వ్యాన్... రావల్పిండి నుంచి గురుజన్‌వాలాకు ప్రయాణికులను తీసుకొస్తోంది. కాసేపట్లో వారంతా వ్యాన్ దిగిపోయేవారే. అంతలోనే ఈ దుర్ఘటన జరిగింది.
నిజానికి ఇక్కడ గ్యాస్ సిలిండర్ తప్పేమీ లేదు. అసలేం జరిగిందంటే... పోలీసుల ప్రకారం... ఈ వ్యాన్... ఓ మినీ ట్రక్కును ఢీకొట్టింది. దాంతో... వ్యాన్‌లో తీవ్ర కదలిక వచ్చింది. ఆ క్రమంలో వ్యాన్ వెనక ఉన్న గ్యాస్ సిలిండర్ గట్టిగా కదిలింది. దానికి పగుళ్లు వచ్చి... ఒక్కసారిగా బాంబు పేలినట్లు పేలిపోయింది. వ్యాన్ మొత్తం మంటల్లో చిక్కుకుంది. చనిపోయిన వాళ్లంతా వ్యాన్‌లో ఇరుక్కుపోయారు. చాలా మంది ఇది ఉగ్రవాదుల పని అనుకున్నారు. కాదని తర్వాత అర్థమైంది.
ప్రస్తుతం DHQ ఆస్పత్రిలో ఏడుగురికి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. వ్యాన్‌లో తీసుకెళ్లాల్సిన వారి కంటే డబుల్ సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకున్నారనీ... అందువల్ల మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని అధికారులు అంటున్నారు. తీవ్ర గాయాలతో ఉన్న వారిని లాహోర్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Dhana Yoga: ధనయోగం అంటే?.. అది పట్టాలంటే ఏం చెయ్యాలి?
ఇలా మృత్యువు రోడ్డు ప్రమాదం, గ్యాస్ బండ పేలుడు రూపంలో వచ్చింది. తప్పించుకునే ఛాన్సే లేకుండా చేసి... ప్రాణాలు పట్టుకుపోయింది. మృతుల బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Breaking news, Pakistan, Viral, VIRAL NEWS