ప్రసవం మహిళకు పునర్జన్మ అంటారు. అందుకే ప్రసవం సమయంలో పెద్దలు పక్కనే ఉండి జాగ్రత్తలు చెబుతుంటారు. కానీ నిండు గర్భిణి అయిన ఓ మహిళ నానా అవస్థలు పడింది. తుఫానుతో తమ ఇంట్లోకి నీరు చేరడంతో నిలువ నీడలేక ఇబ్బందులపడింది. దీంతో నిండు చూలాలు గతిలేని పరిస్థితుల్లో మామిడిచెట్టు ఎక్కి ప్రసవించింది. శిశువుతో రెండురోజుల పాటు చెట్టుపైనే ఉంది. ఇడాయ్ తుఫాను జింబాబ్వే దేశాన్ని అతలాకుతలం చేసింది. మొజాంబిక్ ప్రాంతానికి చెందిన అమేలియా అనే మహిళ ఇంట్లోకి నీరు ప్రవేశించడంతో నెలలు నిండిన గర్భంతో ఎటు వెళ్లాలో తోచలేదు. తన రెండేళ్ల కొడుకును తీసుకుని దగ్గర్లో ఉన్న మామిడిచెట్టుపైకి ఎక్కి అక్కడ తలదాచుకుంది. చెట్టుపైనే పురిటి నొప్పులు రావడంతో ఆమెకు ఏం చేయాలో తోచలేదు. కాసేపటికి అమేలియా అక్కడే ఓ పాపకు జన్మనిచ్చింది.
చెట్టుపైనే చాలా సేపు ఏడ్చింది. పురిటి నొప్పుల వల్ల అరిచానేమో అనుకుంది కానీ... తరువాత తెలిసింది..ఆమెకు ఆ కన్నీళ్లు ఆకలితో వచ్చాయని. సారా అనే పాపకు జన్మనిచ్చిన తరువాత కూడా అమేలియా రెండు రోజులపాటు చెట్టుపైనే ఉండాల్సి వచ్చింది. ఆ తరువాత స్థానికులు ఆమెను గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఆమె తలదాచుకుంది. జింబాబ్వేలో 20 ఏళ్ల క్రితం ఇలాంటి ఘటనే దక్షిణ మొజాంబిక్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
Published by:Sulthana Begum Shaik
First published:April 07, 2019, 13:21 IST