Crypto heist: రూ. 4,460 కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీ చోరీ.. హ్యాకర్‌కు భారీ రివార్డు ప్రకటించిన పాలి నెట్‌వర్క్.. కానీ హ్యాకర్ మాత్రం..

ప్రతీకాత్మక చిత్రం

ఇటీవల క్రిప్టో కరెన్సీ చరిత్రలోనే భారీ చోరీ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. క్రిప్టో కరెన్సీ ట్రాన్స్​ఫర్ చేసే పాలీ నెట్​వర్క్​ సంస్థ నుంచి ఏకంగా హ్యాకర్లు 4.46 వేల కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీని చోరీ చేశారు.

  • Share this:
    ఇటీవల క్రిప్టో కరెన్సీ చరిత్రలోనే భారీ చోరీ వెలుగుచూసిన సంగతి తెలిసిందే. క్రిప్టో కరెన్సీ ట్రాన్స్​ఫర్ చేసే పాలీ నెట్​వర్క్​ సంస్థ నుంచి ఏకంగా హ్యాకర్లు 600 మిలియన్ డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీని చోరీ చేశారు. భారత కరెన్సీలో దీని విలువ రూ. 4.46 వేల కోట్లు. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీనే వెల్లడించింది. ఇథేరియమ్​, బినాన్స్​చైన్​, ఆక్స్​పాలిగన్​ క్రిప్టో టోకెన్లను హ్యాకర్లు కొట్టేశారని, ట్రేడర్ల వాలెట్ల నుంచి మాయం చేశారని ప్రకటించింది. డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ చరిత్రలో ఈ దోపిడీ అతి పెద్దది అని పాలీ నెట్‌వర్క్ పేరకొంది. పోలీ నెటవర్క్ వినియోగిస్తున్న బ్లాక్‌చైన్‌‌ను చేధించి.. హ్యాకర్లు ఇంత పెద్ద మొత్తంలో దోపిడికి పాల్పడ్డారు. హ్యాక్ చేసి కొల్లగొట్టిన సోమ్మును వెంటనే తిరిగి ఇవ్వాలని పాలీ నెట్‌వర్క్ హ్యాకర్‌ను కోరింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మొత్తాన్ని ఒకే వ్యక్తి దొంగిలించినట్టుగా తేలింది.

    ఈ నేపథ్యంలో హ్యాకర్‌ డబ్బు తిరిగి ఇచ్చినందుకు గాను అతనికి రివార్డు అందజేయనున్నట్టుగా పాలీ నెట్‌వర్క్ తెలిపింది. 500,000 డాలర్లు అంటే 3.72 కోట్లు అందజేస్తామని ప్రకటించింది. హ్యాకర్ డబ్బులు తిరిగి పంపిస్తామని చెప్పిన తర్వాత పాలీ నెట్‌వర్క్ ఈ వివాదస్పద ఆఫర్ చేసింది. అయితే హ్యాకర్.. తనకు రివార్డుపై ఆసక్తి లేదని తెలిపారు. అయితే ఇప్పటికే చోరీ చేసి డబ్బులో చాలా వరకు తిరిగి ఇచ్చారు.

    గురువారం సాయంత్రానికి.. హ్యాకర్ ఆధీనంలో ఉన్న మిగిలిన ఆస్తులను హ్యాకర్, కంపెనీ నియంత్రణలో ఉన్న డిజిటల్ వాలెట్‌కు బదిలీ చేసినట్లు పాలీ నెట్‌వర్క్ తెలిపింది. హ్యాకర్ ఆస్తులను తిరిగి చెల్లించే ప్రక్రియ పూర్తిగా పూర్తయ్యే వరకు వేచి చూడనున్నట్టుగా చెప్పింది. ఇందుకోసం హ్యాకర్‌తో కలిసి పనిచేస్తున్నట్టుగా పాలీ నెట్‌వర్క్ చెబుతోంది. ఇదిలా ఉంటే.. పాలీ నెట్వర్క్.. హ్యాకర్‌కు Mr White Hat అని పేరు పెట్టారు. అయితే సాధారణంగా.. నైతిక భద్రతా పరిశోధకులను, లోపాలను కనుగొనడంలో సంస్థలకు సాయం చేయడానికి వారి నైపుణ్యాలను మంచి కోసం వినియోగించేవారిని White Hat హ్యాకర్లుగా పరిగణిస్తారు.

    ఈ చర్యను White Hat ప్రవర్తనలో భాగమని భావిస్తున్నామని.. హ్యాకర్‌కు 500000 డాలర్ల రివార్డు అందించాలని చూస్తున్నట్టుగా పాలీ నెట్‌వర్క్ తెలిపింది. ఈ ఘటనకు హ్యాకర్ జవాబుదారీ కాదని హామీ ఇస్తున్నట్టుగా పేర్కొంది. అయితే పాలీ నైట్‌వర్క్ ప్రకటించిన ఈ రివార్డుపై కొందరు మండిపడుతున్నారు. క్రిమినల్ హ్యాకర్లు వారి నేర పూరిత చర్యలను దాచేందుకు ఇది ఒక ఊదాహరణగా నిలుస్తుందని ఆందోళన చెందుతున్నారు.

    మరోవైపు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన మూడు పేజీల సంభాషణలో.. అనామక హ్యాకర్ సరదా కోసం ఈ దోపిడీని చేసినట్టుగా తెలిపారు. క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ సంస్థ పాలీ నెట్‌వర్క్‌ దాని భద్రతను మెరుగుపరచడానికి ప్రోత్సహించడానికే ఇలా చేసినట్టుగా చెప్పారు.

    ‘హ్యాకర్ వద్ద ఇప్పటికీ 33.4 మిలియన్ డాలర్ల విలువకలిగిన టోకెన్లు ఉన్నాయి. ఎందుకంటే అవి టెథర్ ద్వారా స్తంభింపజేయబడ్డాయి" అని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న బ్లాక్‌చెయిన్ అనలిటిక్స్ సంస్థ ఎలిప్టిక్ సహ వ్యవస్థాపకుడు టామ్ రాబిన్సన్ చెప్పినట్టుగా బీబీసీ తెలిపింది.
    Published by:Sumanth Kanukula
    First published: