Home /News /international /

CRUISE SHIP EVACUATED AFTER ENGINE FAILURE OFF NORWAY COAST ON SUNDAY NK

నార్వేలో నౌకా ప్రమాదం... ప్రయాణికులందర్నీ కాపాడిన త్రివిధ దళాలు

తుఫానులో చిక్కుకున్న నౌక (AFP Photo)

తుఫానులో చిక్కుకున్న నౌక (AFP Photo)

Norway Cruise Ship : 15 గంటలు కష్టపడి విజయవంతంగా ప్రయాణికులందర్నీ రక్షించారు.

నార్వే తీరంలో ఓ భారీ నౌక తుఫానులో చిక్కుకుని పక్కకు ఒరిగిపోయింది. అలర్టైన నార్వే ప్రభుత్వం... ఆ నౌకలో ఉన్న 1300 మంది ప్రయాణికులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ నౌక తీరం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీరానికి వస్తున్న సమయంలో భారీ తుఫాను గాలులు చెలరేగాయి. వాటి దాటికి అంత పెద్ద నౌక కూడా అటూ ఇటూ కదిలిపోయింది. పరిస్థితి అదుపుతప్పి ఓ పక్కకు ఒరిగిపోయింది. ఆ సమయంలో దాని ఇంజిన్ పాడైపోయింది. ఇక మునిగిపోయేలా ఉండటంతో దాని కెప్టెన్... నార్వే నౌకాదళానికి విషయం చెప్పారు. కళ్లముందు నౌక కనిపిస్తున్నా... అందులో ప్రయాణికుల్ని రక్షించడం అంత ఈజీ కాదని నార్వే ప్రభుత్వానికి సైనికాధికారులు తెలిపారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో తుఫాను ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. అయినప్పటికీ త్రివిధ దళాలు రంగంలోకి దిగి... గ్రూపులుగా ప్రజలను తరలించాయి.

మొత్తం 1373 మంది ఉండగా... 15 గంటలు కష్టపడి అందర్నీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రతీ ట్రిప్పులో 15-20 మంది సిబ్బందిని తరలించారు. ప్రతిసారీ ఖాళీ హెలికాప్టర్ రాగానే ప్రయాణికులు... అత్యంత వేగంగా అందులోకి వెళ్లారు. కానీ జోరు గాలులు తరలింపు ప్రక్రియ వేగంగా జరగనివ్వకుండా అడ్డుకున్నాయి. ఆ క్రమంలో గాయపడిన 17 మందిని ఆస్పత్రిలో చేర్చారు.

ఆ నౌక పేరు వైకింగ్ స్కై. 2017లో సముద్రంలోకి ఎంటరైంది. దాని కెపాసిటీ 930 మంది ప్రయాణికులు మాత్రమే. తాజా ఘటనలో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా ప్రమాదానికి ఓ కారణంగా చెబుతున్నారు. నార్వే రాజధాని ఓస్లో నుంచీ 10 నాటికన్ మైళ్ల దూరంలో హస్టాడ్‌వికా పర్యాటక ప్రాంతానికి అది బయలుదేరింది. విహార యాత్ర కోసం నార్వే సహా 14 దేశాల పర్యాటకులు అందులో ఎక్కారు. అది కాస్తా... ప్రమాదయాత్రగా మారింది.

 

ఇవి కూడా చదవండి :

పులివెందుల సీఐపై వివేకా కూతురు సంచలన వ్యాఖ్యలు

నేడు ప్రధాని మోదీ బెంగళూరు వస్తారా? దక్షిణ బెంగళూరుకు నామినేషన్ వేస్తారా?

వర్చువల్ సిమ్ అంటే ఏంటి... పుల్వామా ఉగ్ర దాడిలో ఎలా వాడారు?

స్మృతి ఇరానీ అంటే రాహుల్ భయపడుతున్నారా... ఆమెకు అంత సీన్ ఉందా?
First published:

Tags: World

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు