Video : మొసలి నోట్లోకి పుచ్చకాయ వేస్తే... ఎట్టుంటదో తెలుసా?

Alligator and Watermelon : మనం మనుషులం కాబట్టి పండ్ల వంటి వాటిని స్మూత్‌గా కొరుకుతాం. మొసళ్లు ఈ డిఫరెన్స్ చూపించవు. వాటి నోటికి ఏది చిక్కినా... ఫసక్కే. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో.

Krishna Kumar N | news18-telugu
Updated: August 16, 2019, 9:39 AM IST
Video : మొసలి నోట్లోకి పుచ్చకాయ వేస్తే... ఎట్టుంటదో తెలుసా?
మొసలి నోట్లోకి పుచ్చకాయ వేస్తే... ఎట్టుంటదో తెలుసా? (Image : FB - St. Augustine Alligator Farm Zoological Park)
Krishna Kumar N | news18-telugu
Updated: August 16, 2019, 9:39 AM IST
మొసలికి పుచ్చపండు ఇస్తే... క్షణాల్లో దాన్ని ఫసక్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జస్ట్ ఒక్కసారి కొరికి పుచ్చకాయ మొత్తాన్నీ పచ్చడి చేసింది ఆ మొసలు. ఫ్లోరిడాలోని సెయింట్ అగస్టీన్ అలీగేటర్ ఫార్మ్ జూలాజికల్ పార్క్ వాళ్లు ఈ వీడియోని ఫేస్‌బుక్‌లో అప్ లోడ్ చేశారు. ఆ పార్కులో అదే అతి పెద్ద అమెరికా మొసలి. దాని పేరు బాంబర్. పేరుకు తగ్గట్టే... పుచ్చపండును బాంబు పేలినట్లుగా నోటితో పేల్చేసింది. మొసలి నోట్లోకి పుచ్చకాయను జార విడుస్తున్న వీడియోను స్లో మోషన్‌లో చూపించారు. మొసలి దవడల్లోకి పుచ్చకాయ వెళ్లగానే... క్షణాల్లో దాన్ని పచ్చడి చేసింది. అది వేగంగా నోటిని ముయ్యడంతో... మధ్యలోకి వెళ్లిన పుచ్చపండు... ముక్కలై... సగం పండు బయటపడిపోయింది. మిగతా సగం పుచ్చపండును నోట్లోనే ఉంచుకొని మొసలి నీటిలోకి జారుకుంది.

మిగతా అన్ని జంతువుల కంటే... మొసళ్ల దవడలు బలంగా ఉంటాయి. బాంబర్‌కి 13.5 అంగుళాల దవడలు ఉన్నాయి. అందువల్ల అది పుచ్చకాయను గట్టిగా కొరికేసింది. ఆన్‌లైన్‌లో ఈ వీడియోకి లైక్స్, కామెంట్స్ రోజురోజుకూ పెరుగుతున్నాయి.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...