హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

Sri Lanaka Lifts Emergency : భారత్ భారీ సాయం..శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత

Sri Lanaka Lifts Emergency : భారత్ భారీ సాయం..శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India Help To Sri Lanka : శ్రీలంకలో శాంతి భద్రతలు మెరుగు పడటంతో రెండు వారాల క్రితం విధించిన ఎమర్జెన్సీ(అత్యవసర పరిస్థితి)ని అక్కడి ప్రభుత్వం ఎత్తివేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఎమర్జెన్సీ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది.

ఇంకా చదవండి ...

Sri Lanka Lifts State Of Emergency: శ్రీలంకలో శాంతి భద్రతలు మెరుగు పడటంతో రెండు వారాల క్రితం విధించిన ఎమర్జెన్సీ(అత్యవసర పరిస్థితి)ని అక్కడి ప్రభుత్వం ఎత్తివేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఎమర్జెన్సీ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. ఆర్థిక సంక్షోభం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతుండటంతో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నెల రోజుల్లో రెండోసారి మే 6 అర్ధరాత్రి నుంచి ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్న సమయంలో పోలీసులు, భద్రత దళాలకు విశేష అధికారాలు సంక్రమిస్తాయి. ప్రజలెవరినైనా కారణం చెప్పకుండా అరెస్టు చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి వారికి అధికారం ఉంటుంది.

అయితే, ఎమర్జెన్సీ ఎత్తేసినప్పటికీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై వ్యతిరేకత మాత్రం అలాగే ఉన్నది. వందలాది మంది విద్యార్థులు.. అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్సను డిమాండ్ చేస్తూ తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. చమురు కోసం కుటుంబ సభ్యులు బారులు తీయడం, దీర్ఘకాలం విద్యుత్ కోతలు, ఆహార, ఔషధాల కొరత వంటి సమస్యలు ప్రజలున ఆందోళనలు కొనసాగించడానికే ప్రేరేపిస్తున్నాయి. శ్రీలంకలో ఇటీవల జరిగిన గొడవల్లో ఇప్పటిదాకా 9 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు.

ALSO READ  Quad Summit : క్వాడ్ సదస్సు కోసం జపాన్ బయలుదేరేముందు మోదీ కీలక వ్యాఖ్యలు

కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు ఎన్నో విధాలుగా సాయం అందిస్తున్న భారత్‌ తాజాగా మరో 40 వేల టన్నుల డీజిల్‌ను శనివారం సరఫరా చేసింది. రుణ సాయాన్ని పొడిగించడంలో భాగంగా భారత్‌ డీజిల్‌ను అందజేసింది. అదేవిధంగా బియ్యం, ఔషధాలు, పాలపొడి వంటి అత్యవసర ఉపశమన సామగ్రితో చెన్నై నుంచి ఓ నౌక కూడా శుక్రవారం బయల్దేరింది. ఇందులో దాదాపు రూ. 45 కోట్ల విలువైన 8 వేల టన్నుల బియ్యం, 200 టన్నుల పాలపొడి, ప్రాణాధార ఔషధాలు ఉన్నాయి. శ్రీలంక తీవ్ర ఆహార కొరతను ఎదుర్కోనుందంటూ ఇటీవల ప్రధానమంత్రి రణిల్‌ విక్రమసింఘే ప్రకటించిన విషయం తెలిసిందే.

మరోవైపు, ప్రపంచ ఆహార కార్యక్రమం(WFC)ద్వారా శ్రీలంకకు రూ.11.67 కోట్ల విలువైన అత్యవసర సాయాన్ని జపాన్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ఫోర్టిఫైడ్‌ బియ్యం, పప్పులు, నూనె వంటివాటిని పంపించనున్నట్లు తెలిపింది.

First published:

Tags: India, Sri Lanka

ఉత్తమ కథలు