• HOME
  • »
  • NEWS
  • »
  • INTERNATIONAL
  • »
  • COVID VACCINATION FULLY VACCINATED PERSONS CAN GATHER PRIVATELY WITHOUT MASKS SAYS CDC NK

Corona News: వాళ్లకు మాస్క్ అవసరం లేదు... CDC సంచలన ప్రకటన

Corona News: వాళ్లకు మాస్క్ అవసరం లేదు... CDC సంచలన ప్రకటన

వాళ్లకు మాస్క్ అవసరం లేదు... CDC సంచలన ప్రకటన (File Image credit - twitter)

Corona News: ఇది కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. జనరల్‌గా డాక్టర్లేమో మాస్కులు పెట్టుకోమని మరీ మరీ కోరుతుంటే... CDC మాత్రం విరుద్ధమైన ప్రకటన చేసింది. ఎందుకో తెలుసుకుందాం.

  • Share this:
    Corona News: కరోనా వ్యాక్సిన్ ఫుల్లుగా వేసుకున్న వారంతా మాస్క్ లేకుండా ఓ చోట ఉండొచ్చని CDC తెలిపింది. ఇక్కడ రెండు డౌట్లు వస్తాయి. సీడీసీ అనేది... సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ. ఇది అమెరికాలో రకరకాల వ్యాధులు, వైరస్‌లపై అధ్యయనం చేస్తుంది. ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ సంస్థ. అందువల్ల అది చెప్పిన మాటపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇకు ఫుల్లుగా వ్యాక్సిన్ వేసుకోవడం అంటే... కొన్ని కంపెనీల వ్యాక్సిన్లు 2 డోసులు వేసుకుంటే... ఫుల్లుగా వేసుకున్నట్లు... అదే కొన్ని కంపెనీలైతే... తమ వ్యాక్సిన్ ఒక్క డోసు వేసుకుంటే చాలు అంటున్నాయి. ఆలా వేసుకున్నా... ఫుల్లుగా వేసుకున్నట్లే. అలా వేసుకున్నవారంతా... ఒక చోటికి చేరినప్పుడు మాస్కులు వాడాల్సిన పని లేదనీ, సేఫ్ డిస్టాన్స్ కూడా పాటించాల్సిన అవసరం లేదని అంటోంది CDC.

    ఫుల్లుగా వ్యాక్సిన్ వేసుకున్న వారు మరీ ఎక్కువ మంది కాకుండా... కొద్ది మంది గ్రూపుగా ఉండొచ్చని CDC అంటోంది. ఇక్కడే మరో మెలిక కూడా పెట్టింది. ఫుల్లుగా వ్యాక్సిన్ వేయించుకున్నంత మాత్రాన ఇక ఏ జాగ్రత్తలూ తీసుకోవాల్సిన పనిలేదు అని అనుకోవద్దు అని CDC తెలిపింది. ఎప్పట్లాగే మాస్కులు వాడాలనీ, సేఫ్ డిస్టాన్స్ పాటించాలనీ చెప్పింది. ఎందుకంటే తమ చుట్టూ ఉన్న ప్రజల్లో వ్యాక్సిన్ వేయించుకోని వారు ఉండొచ్చు కదా... వారి నుంచి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. వ్యాక్సిన్ వేయించున్నప్పటికీ... లాంగ్ డిస్టాన్స్ ప్రయాణాలు చేయవద్దని అమెరికాలో ప్రజలను కోరింది.

    ఇండియాలో కంటే ముందే అమెరికాలో కరోనా వచ్చింది. ఇప్పటికీ అక్కడ మిగతా దేశాల కంటే ఎక్కువగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజూ 50వేల నుంచి లక్ష దాకా వస్తున్నాయి. ఐతే... ఆర్థిక పరిస్థితులు దారుణంగా తయారవ్వడంతో... నార్మల్ పరిస్థితుల వైపుగా అడుగులు వేయించేందుకు CDC తన గైడ్‌లైన్స్‌ని కొద్దిగా మార్చింది. ఫలితంగా ఫుల్లుగా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రభుత్వ అధికారులు, వ్యాపారులు, ఉద్యోగుల వంటివారు... మాస్కులు లేకుండానే పనులు చేసుకునేందుకు వీలు కలగనుంది.

    ఇది కూడా చదవండి:Azadi ka Amruth Mahotsav: 75 చోట్ల జెండా ఆవిష్కరణ.. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

    అమెరికాలో కొత్తగా నిన్న 45,116 పాజిటివ్ కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2.97 కోట్లు దాటింది. కొత్తగా 788 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 5.38 లక్షలు దాటింది. గతేడాది చలికాలంతో పోల్చితే... కొత్త కేసులు, మరణాల సంఖ్య 40 శాతం దాకా తగ్గింది. అందువల్ల CDC నిబంధనలను సడలించింది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు