ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతునే ఉన్నాయి. అయినా కరోనా వ్యాక్సినేషన్‌పై ఆయా దేశాలు విధించిన నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు. ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ (European Union) లో ఉన్నా కొన్ని దేశాల్లో ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు వ్యాక్సినేషన్‌పై కీలక ఆదేశాలు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఆయా దేశాల్లో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా వ్యాక్సిన్ ప్రాథమిక హక్కులను దెబ్బతీస్తున్నాయని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీంతో వారు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే బెల్జియం (Belgium) లో చేసిన నిరసన హింసాత్మకంగా మారింది.
Omicron: త్వరలో కరోనా నుంచి విముక్తి.. ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ల కీలక వ్యాఖ్యలు!
50,000 మందితో నిరసన..
బెల్జియం రాజధాని బ్రెస్సెల్స్ (Brussels) లో ఆదివారం కోవిడ్ -19 నిబంధనల పట్ల తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి 50,000 మంది నిరసన కారులు ఆందోళన చేశారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ ఆందోళనలో ప్రజలు చాలా మంది గాయాలపాలయ్యారు. సుమారు 70మందిపైగా ఆందోళన కేసుల్లో పోలీసులు అరెస్ట్ (Arrest) అయ్యారు.
Health Tips: కరోనా వేళ.. పిలల్లకు రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద చిట్కాలు!
పలువురికి గాయాలు..
ఈ ఘర్షణలో ముగ్గురు పోలీసులు (Polices) గాయపడ్డారు. 12 మంది ఆందోళన కారులు కూడా ఆస్పత్రిపాలయ్యారు. దీనిపై బెల్జియం ప్రధాని అలెగ్జాండర్ డిక్రూ మాట్లాడారు. స్వేచ్ఛయుతమైన నిరసనలు ఆమోదిస్తాం కానీ హింసాత్మక చర్యలను సమాజం ఆమోదించదని ఆయన అన్నారు.
Subhash Chandra Bose: ఐసీఎస్‌కు రాజీనామా లేఖలో నేతాజీ ఏం రాశారు.. ట్రెండింగ్‌గా రాజీనామా లేఖ!
వాషిగ్టన్లోనూ..
కోవిడ్ వ్యాక్సినేషన్ (Vaccination) వ్యతిరేక నిరసనలు అమెరికానూ తాకాయి. వాషింగ్టన్లో నిరసనలకు అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ (john f kennedy) మేనల్లుడు రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ నాయకత్వం వహించారు. టీకా వ్యతిరేక వైఖరికి పేరుగాంచిన కెన్నెడీ, వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌లను నాజీ (Nazi) పాలనతో పోల్చారు. ఈ వ్యాఖ్యలను ఆష్విట్జ్ మెమోరియల్ ఖండించింది. ఇది మేథోక్షిణతకు ప్రతీక అని ట్వీట్ చేసింది.
CoWin Portal: కోవిన్ రిజిస్ట్రేషన్‌లో మార్పులు.. ఇకపై మరింత వెసులుబాటు
అంతే కాకుండా మరికొందరు నిరసన కారులు మేము వ్యాక్సిన్ వ్యతిరేకులం కాదని తెలిపారు. కానీ వ్యాక్సినేషన్ అభివృద్ధి హాడివిడిగా జరిగిందని కావును మరింత సమయం తీసుకొని వ్యాక్సినేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ (Biden)ను విమర్శిస్తూ.. ట్రంప్ (Trump)ను అభినందిస్తున్న ప్లకార్డులు దర్శనమిచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona Vaccine, Omicron, Omicron corona variant, Vaccination