Go Corona: కరోనాను తరిమేశామని ఏదైనా దేశం వేడుకలు జరుపుకుంటే... మరి మనకెప్పుడు ఆ రోజు వస్తుందో అని మిగతా దేశాలు ఆవేదనతో చూస్తున్నాయి. ముఖ్యంగా ఇండియా పరిస్థితి దారుణంగా ఉంది. ప్రపంచంలో రోజూ వస్తున్న కొత్త కేసుల్లో సగం ఇండియావే ఉంటున్నాయి. మరి భారత్‌లో కరోనా పోయేది ఎప్పుడో. సరే స్పెయిన్ సంగతి చూద్దాం. అక్కడ శనివారం అర్థరాత్రి పెద్ద సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ముఖ్యంగా యువతీ యువకులు వారిలో ఉన్నారు. వీధుల్లో డాన్సులు చేశారు. ముద్దులు పెట్టుకున్నారు. సరిగ్గా అర్థరాత్రి 12 దాటాక... కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నట్లుగా... గో కరోనా వేడుకలు జరుపుకున్నారు. ఇదంతా కరోనా పోయినందుకు కాదు... ఆరు నెలలుగా అమల్లో ఉన్న లాక్‌డౌన్ ఎత్తివేసినందుకు. కరోనా కేసులు తగ్గిపోవడంతో... ఇక లాక్‌డౌన్ అవసరం లేదనుకున్న ప్రభుత్వం ఆదివారం నుంచి ఎత్తివేసింది.
స్పెయిన్‌లో ప్రజలు ఈ వేడుకలు జరుపుకునేందుకు పూర్తిగా అర్హులే అనుకోవచ్చు. ఎందుకంటే... 2020 నుంచి అక్కడ లాక్‌డౌన్ ఉంది. అది కఠినంగా అమలైంది. ఇళ్లలోంచి బయటకు వస్తే ఊరుకునేవారు కాదు. కనీసం పక్కింటికి వెళ్లే ఛాన్స్ కూడా లేదు. అంత కఠినంగా అమలుచేశారు. ఇప్పడుు లాక్‌డౌన్ ఎత్తేశారు కాబట్టి... అక్కడ ప్రజలు... రోడ్లపై తిరగవచ్చు. ఇతర ప్రాంతాలకు ట్రావెల్ చెయ్యవచ్చు.
Maskless revelers partied in Barcelona as a curfew ended in most of Spain, but others feared it was too soon to let go https://t.co/Q4BPBFPLF6 pic.twitter.com/BQdP4CXXcs
— Reuters (@Reuters) May 11, 2021
దేశంలోని 17 ప్రాంతాల్లో కరోనా రూల్స్ ఎత్తేశారు. అక్కడ కొత్తగా రోజూ 4వేల దాకా కొత్త కేసులు వస్తున్నాయి. వాటి సంఖ్య అంతకన్నా పెరగట్లేదు. దాంతో... ఇక పెరగవులే అనుకున్న ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తేసింది. మరోవైపు వ్యాక్సినేషన్ డ్రైవ్ కొన్ని వారాలుగా జోరుగా సాగుతోంది.
Cue the fiesta, as Spain ends a six-month COVID state of emergency. pic.twitter.com/Rs0dn9owe8
— DW News (@dwnews) May 10, 2021
శనివారం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లోని సెంట్రల్ ప్యూర్టా డెల్ సోల్ స్క్వేర్ దగ్గర ప్రజలు పెద్ద సంఖ్యలో చేరి... మాస్కులు లేకుండా ఎంజాయ్ చేశారు. ఐతే... ఇలాంటి వేడుకలు జరుపుకోవద్దని ప్రభుత్వం ముందే చెప్పింది. అయినా వాళ్లు వినలేదు. ఇలాగే ఊరుకుంటే... మళ్లీ కరోనా పెరగవచ్చని భావించిన పోలీసు అధికారులు... యువతను పంపించేసేందుకు నానా తిప్పలు పడ్డారు. అక్కడే కాదు దేశంలోని చాలా చోట్ల ఇలాంటి వేడుకలు జరిగాయి. స్పెయిన్ బీచులకు కూడా రాత్రివేళ వెళ్లి ఎంజాయ్ చేశారు.
ఇది కూడా చదవండి:WhatsApp: ప్రైవసీ పాలసీపై వాట్సాప్ కొత్త మెలిక... ఒప్పుకోకపోతే... ఈ సర్వీసుల్లో కోత
ఇక స్పెయిన్‌లో రెస్టారెంట్లు, బార్లు రాత్రి 11 వరకూ తెరిచే ఉంటాయి. ఒక్కో టేబుల్‌కి నలుగురు కూర్చోవచ్చు. ప్రస్తుతం స్పెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు అంటే... బాలెరిక్ ఐలాండ్స్, కానరీ ఐలాండ్స్, నవర్రా, వాలెన్సియాలో మాత్రమే కర్ఫ్యూ అమల్లో ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Spain