China Corona : చైనాలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంపై తాము ఆందోళన చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ గెబ్రెయెసస్ తెలిపారు. "చైనా తమ డేటా మాకు ఇస్తుందనీ. మేము కోరిన అధ్యయనాలు జరుపుతుందని ఇప్పటికీ ఆశిస్తూనే ఉన్నాం. దీనిపై కంటిన్యూగా విన్నపాలు చేస్తూనే ఉంటాం. నేను ఇదివరకు చాలా సార్లు చెప్పినట్లు.. ఈ కరోనా ఎక్కడి నుంచి పుట్టింది అనే అంశంపై ఉన్న ఊహాగానాలన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి" అని టెడ్రోస్ తెలిపారు.
"ఈ కొత్త వేరియంట్ వల్ల ముప్పు ఎలా ఉంటుందో కచ్చితమైన అంచనా వెయ్యాలంటే.. మాకు సరైన సమాచారం కావాలి. మృతులు ఏ స్థాయిలో ఉన్నారో తెలియాలి. ఎంత మంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు? ఐసీయూ ఎంత మందికి అవసరం అవుతోందో మాకు తెలియాలి. చైనా తన ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు మేము పూర్తిగా సహకరిస్తున్నాం. చైనా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మా సాయం కొనసాగిస్తాం" అని టెడ్రోస్ వివరించారు.
ఇదివరకటితో పోల్చితే.. ఇప్పుడు కరోనాపై అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న టెడ్రోస్.. ప్రస్తుతం ఒమైక్రాన్ తొలిదశలోనే ఉందని తెలిపారు. గత వారం నుంచి చైనాలో కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. రాజధాని బీజింగ్‌లో ఆస్పత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయనీ.. ఎక్కడికక్కడ మృతులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఎమర్జెన్సీ వార్డులన్నీ నిండిపోవడంతో.. నేలపైనే పడుకోబెట్టి ట్రీట్‌మెంట్ అందిస్తున్నారనే వాదన ఉంది. చైనా మాత్రం కరోనా కేసులు, మరణాలను చాలా తక్కువగా చెబుతోంది. నిన్న ఆ దేశంలో కొత్త కేసులు 3,101 కాగా.. ఎవరూ చనిపోలేదని తెలిసింది. ప్రస్తుతం ఆ దేశంలో యాక్టివ్ కేసులు 37,180 ఉన్నట్లు తెలిసింది. ఐతే.. ఈ లెక్కలు ఎంతవరకూ నిజం అన్నది చైనాకే తెలియాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Corona, Coronavirus, Covid-19, WHO