ప్రపంచ దేశాలను మళ్లీ కరోనా వైరస్ (Corona Virus) భయపెడుతోంది. రెండేళ్ళ క్రితం చైనా (China)లో పుట్టిన కరోనా వైరస్.. తగ్గినట్టే తగ్గి మళ్లీ విస్తరిస్తోంది. రకరకాల రూపాలను సంతరించుకుని ప్రజలను భయ పెడుతోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ ప్రపంచం అంతా విస్తరించింది. మొదటి కేసు నమోదై ఇప్పటికి 22 నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా ఎంత మంది అకాల మృత్యువు ఒడిలోకి చేరుకొన్నారు అనే అంశపై జాన్స్ హాప్కి న్స్ యూనివర్సిటీ రిసెర్చ్ (University Research) చేసింది. ఈ రీసెర్చ్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50లక్షలపైనే జనం కరోనా కారణంగా మృతి చెందినట్టు తెలిసింది. కొవిడ్ విలయానికి అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్ (Britain), బ్రెజిల్ దేశాల ప్రజలు విలవిలలాడిపోయారు. భారత్ కూడా కరోనా కారణంగా ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంది.
అమెరికాలో అత్యధికం..
ఎన్నో మౌలిక వసతులు.. ఆర్థిక సంపత్తి.. వైద్య సదుపాయాలు ఉన్న అమెరి (America) కరోనా కారణంగా ఎక్కువ నష్టపోయినట్టు సమాచారం.
Covid 19 Vaccination : పిల్ల టీకా వచ్చేసింది.. సూది అవసరం లేదు.. ధర ఎంతో తెలుసా?
కోవిడ్ కారణంగా అత్యధికంగా అమెరికాలో 7,40,000 మరణాలు సంభవిం చాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19తో మరణించిన వారి సంఖ్య అనధికారికంగా మరింత ఎక్కువగానే ఉన్నట్లు అంతర్జాతీయ (International) నివేదికలు వెల్లడిస్తున్నాయి.
భారత్‌లో పరిస్థితి..
సంపన్న దేశాలతో (అమెరికా, బ్రిటన్, రష్యా ) పోలిస్తే భారత్‌లో రోజువారీ కొవిడ్ మరణాలు తక్కువగా ఉన్నాయి. భారత్‌లో కరోనా కారణంగా ఇప్పటి వరకు 4లక్షల 58వేల మంది చనిపోయారు. అత్యంత విషాదకరం ఏంటంటే 1950 నుంచి ఇప్పటి వరకు అతర్జాతీయంగా జరిగిన యుద్ధాల్లో మరణిం చిన వారి సంఖ్య కంటే కరోనా కారణంగా మరణించ వారే ఎక్కువగా ఉన్నారు.
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 12,830 కరోనా కేసులు నమోదయ్యాయి. 14,667 మంది కోవిడ్ మహమ్మారి నుంచి సంపూర్ణంగా కోలుకున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 446 మరణాలు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో నమోదైన మొత్త కరోనా కేసుల సంఖ్య 3,42,73,300కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 3,36,55,842 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 4,58,186 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో 1,59,272 కరోనా యాక్టివ్ కేసులున్నాయి కొన్ని రోజులుగా కరోనా బులెటిన్‌లో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఐతే ఇవన్నీ ఒక్కరోజు జరిగినవి కావు. కేరళలో గతంలో నమోదైన బ్యాక్‌లాక్ మరణాలను తాజా బులెటిన్‌లో యాడ్ చేయడం వల్ల.. కరోనా మరణాలు పెరిగినట్లుగా కనిపిస్తోంది. ఇక 7,427 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. 7,166 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కేరళలో 79,2341 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళలో రికవరీల కంటే కొత్త కేసులు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Covid -19 pandemic, India