ఏంటీ దుస్తులు.. విమానం దిగిపొండి.. ఆఫ్రో అమెరికన్‌పై వివక్ష..

రోవ్ దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేసిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది.. మీతో మాట్లాడాలి బయటకు రండి అని విమానం నుంచి దించారు. 'మీ వద్ద జాకెట్ ఉందా..?' అని సిబ్బంది ప్రశ్నించగా.. రోవ్ లేదని చెప్పారు. అయితే ఇలాంటి వస్త్రధారణతో తాము లోపలికి అనుమతించమని తేల్చి చెప్పారు.

news18-telugu
Updated: July 12, 2019, 9:04 AM IST
ఏంటీ దుస్తులు.. విమానం దిగిపొండి.. ఆఫ్రో అమెరికన్‌పై వివక్ష..
తిషా రోవ్ (Image : Twitter)
  • Share this:
వస్త్రధారణ సరిగా లేదన్న కారణంతో జమైకాకి చెందిన ఓ మహిళా డాక్టర్‌ను అమెరికన్ ఎయిర్‌లైన్ ఫ్లైట్స్ విమానంలోకి అనుమతించలేదు. దుస్తులు మార్చుకుని వస్తేనే లోపలికి అనుమతిస్తామని.. లేదంటే విమానం దిగిపోవాలని చెప్పారు. చివరకు బ్లాంకెట్ లాంటి ఓ వస్త్రంతో కవర్ చేసుకోవడంతో.. ఆమెను విమానంలోకి అనుమతించారు. జమైకాలోని కింగ్స్‌టన్ ఎయిర్‌పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. తిషా రోవ్ అనే ఆఫ్రో అమెరికన్.. అమెరికాలోని మియామిలో ఫిజిషియన్ డాక్టర్‌గా స్థిరపడ్డారు.జూన్ 30వ తేదీన మెడికల్ పని నిమిత్తం జమైకా వెళ్లి తిరుగు పయనమయ్యారు. జమైకాలోని కింగ్స్‌టన్ ఎయిర్‌పోర్టులో మియామికి వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్ ఫ్లైట్ ఎక్కారు. జమైకాలో సాధారణంగా ఎండ తీవ్రత ఎక్కువ కాబట్టి..ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఆమె రాంపర్(వన్ పీస్ ఔటర్ గార్మెంట్) ధరించారు. అయితే ఆ దుస్తులపై అభ్యంతరం వ్యక్తం చేసిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది.. మీతో మాట్లాడాలి బయటకు రండి అని విమానం నుంచి కిందకు దించారు.'మీ వద్ద జాకెట్ ఉందా..?' అని సిబ్బంది ప్రశ్నించగా.. రోవ్ లేదని చెప్పారు. అయితే ఇలాంటి వస్త్రధారణతో తాము లోపలికి అనుమతించమని తేల్చి చెప్పారు.

అయితే ఫ్లైట్ మిస్ చేసుకోవద్దన్న ఉద్దేశంతో.. రోవ్ ఒక బ్లాంకెట్ లాంటి వస్త్రాన్ని కప్పుకున్నారు.తీరా విమానంలోకి ఎక్కాక చూస్తే.. తనకంటే కురచ దుస్తుల్లో మరో మహిళ ఉండటం కనిపించింది. ఆమె దుస్తులపై ఎలాంటి అభ్యంతరం చెప్పని సిబ్బంది.. తన దుస్తులపై మాత్రం ఎందుకు అభ్యంతరం చెప్పారని ఆశ్చర్యపోయింది. నిజానికి తాను ధరించిన దుస్తుల్లో తాను బాగానే కనిపిస్తున్నానని.. అంత ఎబ్బెట్టుగా ఏమీ లేదని రోవ్ చెప్పారు. అయినప్పటికీ తాను బ్లాక్‌ను కాబట్టే ఈ వివక్ష చూపించారని ఆమె వాపోయారు.జరిగిన తప్పిదాన్ని తెలుసుకున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ మేనేజ్‌మెంట్ ఎట్టకేలకు ఆమెకు క్షమాపణలు చెప్పారు. అంతేకాదు, విమాన ఖర్చులను కూడా తిరిగి ఇచ్చేశారు. ఈ ఘటన గురించి రోవ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అమెరికాలో ఇది చర్చనీయాంశంగా మారింది.


First published: July 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు