హోమ్ /వార్తలు /అంతర్జాతీయం /

OMG : ప్రీ వెడ్డింగ్ షూట్..అకస్మాత్తుగా పిడుగుపడి వరుడు మృతి

OMG : ప్రీ వెడ్డింగ్ షూట్..అకస్మాత్తుగా పిడుగుపడి వరుడు మృతి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Groom Died While Pre Wedding Shoot : మన జీవితం అనిశ్చితితో కూడుకున్నదని అంటారు. ఎప్పుడు జరుగుతుందో ఏమీ చెప్పలేం. అందుకే చాలా సార్లు మనం ఆనందం కోసం నిరీక్షిస్తూ ఉండటం, ఈలోగా జరిగే కొన్ని సంఘటనలు మనల్ని కలచివేస్తుంటాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Groom Died While Pre Wedding Shoot : మన జీవితం అనిశ్చితితో కూడుకున్నదని అంటారు. ఎప్పుడు జరుగుతుందో ఏమీ చెప్పలేం. అందుకే చాలా సార్లు మనం ఆనందం కోసం నిరీక్షిస్తూ ఉండటం, ఈలోగా జరిగే కొన్ని సంఘటనలు మనల్ని కలచివేస్తుంటాయి. జీవితంలో కొన్ని సంఘటనలు ఊహించలేని విధంగా జరుగుతాయి. తాజాగా చైనా(China)లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రీ వెడ్డింగ్ షూట్(Pre Wedding Shoot) కోసం వెళ్లిన చైనాకు చెందిన ఓ జంట వరుడి మృతదేహాంతో(Groom Deadbody) తిరిగి రావడం అందరినీ షాక్ కు గురిచేసింది. పెళ్లి ఆనందం శోక సంద్రంగా మారింది. యునాన్ ప్రావిన్స్‌లోని జేడ్ డ్రాగన్ స్నో మౌంటైన్ దగ్గర ఈ బాధాకరమైన ప్రమాదం జరిగింది.


షూట్ సమయంలో పెళ్లికొడుకుపై పిడుగు పడింది
జాడే డ్రాగన్ స్నో మౌంటైన్ నిర్వహణ కమిటీ ప్రకారం, ఈ ప్రమాదం బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో జరిగింది. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కోసం ఈ జంట స్ప్రూస్ మేడో చేరుకున్నారు. ఈ ప్రదేశం ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌కి చాలా ప్రసిద్ధి చెందింది. షూటింగ్ మధ్యలో వరుడిపై పెద్ద శబ్దంతో మెరుపు ఆకాశం నుంచి పడింది. అక్కడ ఉన్న ఎమర్జెన్సీ సర్వీసెస్ వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ఘటనలో మిగిలిన వారు సురక్షితంగా ఉన్నారు. వరుడి పేరు రువాన్. వారు షూటింగ్ కోసం వెళ్ళిన ప్రదేశానికి ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.Pilots Flight : విమానం గాల్లో ఉండగా కొట్టుకొన్న పైలట్లు..చివరికి ఏమందంటే..


ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన చిన్న వీడియోను చైనా వీడియో షేరింగ్ యాప్ డౌయిన్‌లో షేర్ చేయగా అది చాలా వైరల్‌గా మారింది. ఆ వీడియోలో వరుడు స్ట్రెచర్‌పై వెళ్తున్న వీడియోను దాదాపు 80 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోలో వరుడి ఆత్మకు శాంతి కలగాలని నెటిన్లు ప్రార్థిస్తుండగా.. చనిపోవడానికి ఒక్క సెకను ముందు కూడా అతను సంతోషకరమైన వైవాహిక జీవితం గురించి కలలు కంటున్నాడని కొందరు విచారం వ్యక్తం చేశారు. సదరు వధువుకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: China, Lightning strike, Photo Shoot, Viral on internet, Wedding

ఉత్తమ కథలు