ప్రేమికుల కొంపముంచిన సరసం.. తీరని విషాదం..

బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడంతో.. రైలింగ్ వద్దకు వెళ్లి ఇద్దరూ ముద్దులు,కౌగిలింతల్లో మునిగిపోయారు. అయితే సరసాల్లో పడి పట్టు తప్పిపోవడంతో.. ఇద్దరూ కింద పడిపోయారు.

news18-telugu
Updated: August 7, 2019, 6:03 PM IST
ప్రేమికుల కొంపముంచిన సరసం.. తీరని విషాదం..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: August 7, 2019, 6:03 PM IST
ప్రేమ మైకంలో ఎక్కడేం చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో ఓ జంట ముద్దుల్లో మునిగిపోయింది. 50 అడుగుల ఎత్తైన ఓ వంతెన రైలింగ్‌పై నిలబడి ప్రపంచాన్ని మరిచి రొమాన్స్‌లో తేలిపోయింది. సరసాల్లో మునిగితేలుతుండగా.. ప్రమాదవశాత్తు ఇద్దరూ కిందపడిపోయారు. దీంతో తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సౌత్ అమెరికాలోని పెరూ పరిధిలో ఉన్న కుస్కోలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మేబెత్ ఎస్పినోజ్(34),హెక్టర్ విడల్ (36) ఇటీవల కుస్కోలోని ఓ నైట్ క్లబ్‌కి వెళ్లారు. తిరిగొస్తుంటే..దారిలో ఉన్న బెత్లెహామ్ బ్రిడ్జిపై ఆగారు. ఆ సమయంలో బ్రిడ్జిపై ఎవరూ లేకపోవడంతో.. రైలింగ్ వద్దకు వెళ్లి ఇద్దరూ ముద్దులు,కౌగిలింతల్లో మునిగిపోయారు. అయితే సరసాల్లో పడి పట్టు తప్పిపోవడంతో.. ఇద్దరూ కింద పడిపోయారు. అనంతరం కాంటిజెన్సియా అనే ఆస్పత్రికి తరలించినప్పటికీ.. తలకు తీవ్ర గాయమై అప్పటికే ఎస్పినోజ్ మృతి చెందాడు. ఆ తర్వాత చికిత్స పొందుతూ విడల్ కూడా చనిపోయింది. వీరిద్దరూ స్థానికంగా టూరిస్ట్ గైడ్స్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం.

First published: August 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...