రూ.1300ల వైన్ ఆర్డర్ చేస్తే... రూ.1.47 లక్షల వైన్ ఇచ్చారు... ఆ తర్వాత ఏమైందంటే...

Wine Story: రెస్టారెంట్‌లో మనం ఆర్డర్ ఇచ్చిన దాని కంటే బెస్ట్ ఫుడ్ మనకు లభిస్తే... ఆ ఆనందమే వేరు. అలాగే... ఆర్డర్ ఇచ్చిన దానికంటే చవకైనది వస్తే... అది ఇబ్బందికరమే. ఆ రెస్టారెంట్‌లో జరిగిన పొరపాటు ఏంటో తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 26, 2020, 11:10 AM IST
రూ.1300ల వైన్ ఆర్డర్ చేస్తే... రూ.1.47 లక్షల వైన్ ఇచ్చారు... ఆ తర్వాత ఏమైందంటే...
రూ.1300ల వైన్ ఆర్డర్ చేస్తే... రూ.1.47 లక్షల వైన్ ఇచ్చారు... ఆ తర్వాత ఏమైందంటే... (File)
  • Share this:
హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు ఒకరు చేసిన ఆర్డర్‌ను వెయిటర్లు మరొకరికి ఇవ్వడం పొరపాటున అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ చిన్న పొరపాటు కొన్నిసార్లు ఇబ్బందిపెట్టొచ్చు. మరికొన్ని సార్లు నవ్వులపాలు చేయొచ్చు. అమెరికా... న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్లో వెయిటర్లు చేసిన ఓ చిన్న పొరపాటు చివరకు హాస్యాస్పదంగా ముగిసింది. 18 డాలర్లు (రూ.1300) విలువ కలిగిన వైన్‌ను ఓ యువ జంట ఆర్డర్ చేసింది. రెస్టారెంట్ సిబ్బంది ఆ జంటకు... 2000 డాలర్లు (రూ.1.47 లక్షలు) విలువ కలిగిన వైన్‌ను సర్వ్ చేశారు. ఆ తర్వాత ముక్కున వేలేసుకున్నారు. ఈ విషయాన్ని న్యూయార్క్ రెస్టారెంట్ యజామాని కీత్ మెక్నాలీ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పంచుకున్నారు.

మ్యాన్‌హట్టన్‌లోని బ్రాస్సెరీ బ్లాథేజరీ రెస్టారెంట్‌లో ఓ వ్యాపారవేత్త "చౌతు మౌటెన్ రోత్స్ చైల్డ్" అనే ఖరీదైన వైన్‌ను ఆర్డర్ చేశాడు. అదే సమయంలో ఓ యువ జంట తక్కువ ధర ఉండే "పినోట్ నోయర్ వైన్" ఆర్డర్ చేశారు. అయితే ఇక్కడ రెస్టారెండ్ సిబ్బంది రెండు భిన్నమైన వైన్లను ఒకేలా ఉన్న డికాంటర్లలో పోసి సర్వ్ చేశారు. పొరపాటున ఆర్డర్ అటు ఇటు మారింది. చౌకైన వైన్‌ను వ్యాపారవేత్త తాగగా... ఖరీదైన దాన్ని యువ జంట తాగారు. కాసేపటి తర్వాత తాము చేసిన తప్పును రెస్టారెంట్ సిబ్బంది తెలుసుకున్నారు. ఆ విషయాన్ని మేనేజర్ కీత్‌కు చెప్పారు.

ఇద్దరు కస్టమర్లు హ్యాపీ మూడ్‌లో ఉండటాన్ని గమనించిన కీత్ వారి దగ్గరకు వెళ్లి.... తమ సిబ్బంది చేసిన తప్పును చెప్పి... సారీ చెప్పాడు. అది విన్న కస్టమర్లు షాక్ అయ్యారు. అలా జరిగిందా... అయ్యో అన్నారు. ఇక్కడో చిత్రమైన విషయం ఉంది. ఖరీదైన వైన్ ఆర్డర్ చేసిన వారికి వైన్ స్వచ్ఛతను తెలపడానికి హోటల్ సిబ్బంది ముందుగా చవకైన వైన్‌ను శాంపిల్‌గా రుచి చూపిస్తారు. ఆ తర్వాత ఖరీదైనది ఇస్తారు. తద్వారా... కస్టమర్... తేడాను గుర్తించగలరు. కానీ... ఇక్కడ ఖరీదైనది ఆర్డర్ ఇచ్చిన వ్యాపారవేత్త... చవకైనది తాగి... ఆ తర్వాత... మళ్లీ చవకైనదే తాగి కూడా... రెండూ ఒకేలా ఉన్నాయని చెప్పలేదు. అలా చెప్పి ఉంటే... ముందే ఈ తప్పును గుర్తించడానికి వీలయ్యేది.

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్


ఈ అంశంపై ఆ వాల్ స్ట్రీట్ వ్యాపారవేత్త "నేను ముందే అనుకున్నా అది చౌతు మౌటన్ రోత్స్ చైల్డ్ కాదని" అని అన్నారు. జరిగిన పొరపాటును ఆయన తేలిగ్గానే తీసుకున్నారు. "సర్లే... అయ్యిందేదో అయిపోయింది" అన్నట్లుగా ఫీలవుతూ... తనకు ఇచ్చిన చవకైన వై‌న్‌నే తాగి ఎంజాయ్ చేశాడు. దానికే బిల్లు చెల్లించాడు. ఇటు... ఈ జంట... అనుకోకుండా ఖరీదైనది తాగి... విషయం తెలిశాక చాలా ఖుషీ అయిపోయారు. బిల్లు మాత్రం తాము ఆర్డర్ ఇచ్చిన దానికే చెల్లించారు. ఎటొచ్చీ రెస్టారెంట్ ఓనరే అడ్డంగా లాస్ అయ్యాడు.

ఈ సంఘటన 2000వ సంవత్సరం ప్రారంభంలో జరిగిందని కీత్ తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయం చెప్పాక... నెటిజన్లు భిన్నంగా స్పందించారు. "ఇది చాలా దారుణం" అని ఒకరు స్పందించగా.. "రెస్టారెంట్‌కు సంబంధించిన చాలా గొప్ప స్టోరీ విన్నానని" మరొకరు సెటైర్ వేశారు.
Published by: Krishna Kumar N
First published: October 26, 2020, 11:10 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading