COUNTRY WHERE NO HOLIDAY ON SUNDAY PEOPLE WORK FOR FREE PVN
North Korea : కిమ్ సంచలన నిర్ణయం..ఉద్యోగులకు ఆదివారం కూడా సెలవు లేదు
ఉద్యోగులతో అధ్యక్షుడు కిమ్
ఆ దేశాన్ని పాలిస్తున్న నియంత కిమ్ జోంగ్ ఉన్ దేశం నుండి ఏ విషయాన్ని బయటకు రానివ్వడు కాబట్టి ఈ దేశాన్ని రహస్యంగా పిలుస్తారు. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడి పరిస్థితులు ఏమిటో తెలుసుకోవడం చాలా కష్టం.
No Holiday In North Korea: ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి వారంలో ఒక రోజు సెలవు(Weekly Off)అవసరం. దాదాపు ప్రతి ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థలో ఉద్యోగులకు సెలవు(Holiday)నిర్ణయించబడింది. చాలా సంస్థలు ఆదివారాలు తమ ఉద్యోగులకు సెలవుని ఇస్తాయి. అయితే కొన్ని సంస్థలు ఉద్యోగులకు ఆదివారం కాకుండా వారంలోని ఇతర రోజుల్లో సెలవు ఇస్తుంటాయి. ప్రపంచంలో కూడా అలాంటి దేశం ఉంది, ఇక్కడ ఉద్యోగులకు ఏడాది పొడవునా సెలవులు (ఆదివారాల్లో సెలవులు లేవు) ఇవ్వరు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఆదివారం కూడా తెరిచి ఉంటాయి. వారంలోని మిగతారోజుల్లానే ఆదివారం కూడా అక్కడి ప్రజలు పని చేస్తారు. ప్రపంచంలో అత్యంత రహస్య దేశాల్లో ఒకటైన ఉత్తర కొరియా(North Korea) గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ దేశాన్ని పాలిస్తున్న నియంత కిమ్ జోంగ్ ఉన్ దేశం నుండి ఏ విషయాన్ని బయటకు రానివ్వడు కాబట్టి ఈ దేశాన్ని రహస్యంగా పిలుస్తారు. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడి పరిస్థితులు ఏమిటో తెలుసుకోవడం చాలా కష్టం. కొన్ని సార్లు ఎవరైనా ఉత్తర కొరియా నుండి తప్పించుకుని ఇతర దేశాల్లో సెటిల్ అయినప్పుడు ఈ దేశ రహస్యాలను బయటపెడుతుంటారు ఈ దేశానికి సంబంధించిన తాజాగా బయటకు వచ్చిన ఒక విషయం ఏమిటంటే, ఈ దేశంలోని ప్రజలకు ఆదివారం సెలవులు ఇవ్వరు. సెలవులు దేశ ప్రయోజనాల కోసం కాదని కిమ్ అంటుంటారట.
ఆదివారం ఉచితంగా పని
ఇక్కడ నివసించే ప్రతి వ్యక్తి ఆదివారం సాధారణ పనిదినం వలె పని చేయాలి. ఇక్కడ దేశ ప్రగతికి మానవ వనరులను సద్వినియోగం చేసుకుంటామని పేర్కొన్నారు. దీనిని ప్రజల దేశభక్తి లేదా నియంత భయం అని చెప్పవచ్చు. ఉత్తర కొరియాలో, ప్రతి వ్యక్తి ఆదివారం సాధారణ రోజులలో పనిచేస్తాడు. అత్యవసరమైనప్పుడు మాత్రమే ఆఫీసులో సెలవు ఇస్తారు. ఒక వ్యక్తి చాలా అనారోగ్యంతో అతను కూర్చోలేని స్థితిలో ఉంటే, అప్పుడు మాత్రమే ఇక్కడ సెలవులు ఇవ్వబడతాయి.
జీతం చెల్లించరు
ఉత్తర కొరియా కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులకు కేవలం ఆరు రోజులు మాత్రమే జీతం ఇస్తారు. అంటే ఆదివారం చేసే పని ఉచితం. దానికి ఎలాంటి రెమ్యూనరేషన్ అందదు. ఈ ఒక ఉచిత రోజు పనిని దేశ పురోగతికి ప్రజలు చేసిన సహకారంగా పరిగణించాలని అధినేత కిమ్ తెలిపారు. ప్రభుత్వోద్యోగి అయినా, ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి అయినా అందరూ ఆదివారాలు ఉచితంగా పనిచేస్తారు. నియంత ప్రకారం సెలవు తీసుకోవడం దేశ ప్రయోజనాల కోసం కాదని.. ఇలా కాకుండా ఆదివారాలు హాయిగా పని చేస్తే దేశం పురోగమిస్తుందని కిమ్ చెబుతుంటారంట.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.