Home /News /international /

COSTLY PHONES CATCH IN NET INSTEAD OF FISH IN HUNTING VRY

Viral news : మత్య్యకారుడి అద‌ృష్టం...వలలో చేపలకు బదులు ఐఫోన్ల పెట్టెలు,... !

చేపలకు బదులు ఐఫోన్స్

చేపలకు బదులు ఐఫోన్స్

Viral news : చేపలు పడాల్సి వలకు చిన్న చిన్న ఐఫోన్లు చిక్కాయి.. ఇంకా.. మ్యాక్ ల్యాప్‌టాప్‌లు ఐపాడ్స్ వలకు చిక్కాయి.. దీంతో ఆ మత్స్యకారుడు ఒక్కసారిగా కొట్ల రూపాయలు సంపాదించాడు.

    సాధారణంగా చేపల వేటకు వెళ్లిన జాలర్లకు వలలో పెద్ద పెద్ద చేపలు పడడం సర్వసాధారణం.. అప్పుడప్పుడు అరుదుగా లభించే విలువైన చేపలు పడుతుంటాయి.. దీంతో ఒక్కసారిగా ఆ జాలర్లు కోటిశ్వరులు అయిపోతారు. ఇటివల ఇలాంటీ సంఘటనలు చాలా వెలుగు చూస్తున్నాయి.. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన అందుకు విరుద్దంగా జరిగింది. వలలో చేపలకు బదులుగా విలువైన ఐఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చిక్కాయి. అవికూడా వందల సంఖ్యలో ఉండడంతో ఆ జాలరి ఒక్కసారిగా కోటిశ్వరుడిగా మారినట్టు తెలుస్తోంది.

    సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలరీకి చేపలకు బదులుగా విలువైన ఐఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు పడ్డాయి. ఫోన్లన్ని ఎలాంటీ డ్యామేజి లేకుండా లభించడంతో వాటిని అమ్మి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాడు ఆ జాలరి.వివరాల్లోకి వెళితే...ఇండోనేషియాకు చెందిన నషీబా అనే ఓ మత్య్యకారుడు ఎప్పటిలాగే ఓ రోజు చేపల వేటకు వెళ్లాడు. అయితే ఆ రోజు మాత్రం చేపలకు బదులుగా వలలో పెద్ద పెద్ద ప్యాకింగ్ చేసిన పెట్టెలు వలలో చిక్కుకున్నాయి. ఒక పెద్ద బాక్సులో యాపిల్ ఫోన్లతో పాటు మ్యాక్‌బుక్‌తో పాటు ఐపాడ్లలు కుప్పలు కుప్పలుగా బయటపడ్డాయి. దీంతో ఆ మత్స్యకారుడి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. తనకు లభించిన వాటిని వీడియో తీసి ట్విట్టర్‌లో షేర్ చేశాడు.

    Khammam :విషాదం...! కొడుకు మృతిని తట్టుకోలేని తండ్రి... ఖననం చేసిన చోటే ఉరి...!


    కాగా నీటిలో ఉన్న ఐఫోన్లపై కూడా నెటిజన్లు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. నీటిలో ఉన్న ఫోన్లు ఎలా డ్యామేజ్ కాకుండా ఉన్నాయని ప్రశ్నించారు. దీంతో వాటి ప్యాకింగ్ కూడా పటిష్టంగా ఉందని వస్తువుల్లోకి నీళ్లు పోకుండా ప్లాస్టిక్ ప్యాకింగ్ చేసి ఉన్నట్టు వివరించాడు. చిన్నబాక్సులుగా వాటిని అమర్చి ఉన్నట్టు చెప్పాడు.

    Crime News: పేకాట ఆడుతున్న పందెంరాయుళ్ల గుట్టురట్టు.. దొరికిన వారిలో కార్పొరేటర్ల భర్తలతో పాటు..


    ఇంతకి అసలు విషయం ఏమిటంటే గతంలో కూడా ఇలాంటీ ప్యాకెట్లు నీళ్లలో తేలుతూ ఓ వ్యక్తికి కనిపించాయట.. అయితే అప్పటి ప్యాకెట్లలో మాత్రం కొకైన్ ఉన్నట్టు గుర్తించారు. ఇలా సుమారు 30 కిలోల వరకు ఆ ప్యాకెట్లలో లభించినట్టు చెప్పారు. దీన్ని బట్టి ఐఫోన్ల ముసుగులో కోకైన్ ప్యాకెట్లను స్మగ్లింగ్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. ఇలా ఎప్పుడైన పోలీసులకు పట్టుపడితే.. ఫోన్ల పేరు చెప్పి తప్పించుకునేందుకు అవకాశం ఉండే విధంగా స్మగ్లర్లు ఇలా ప్యాకింగ్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Fish, International news, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు