Covid 19: కరోనాను జయించిన వారికి షాక్. కొంతమందిలో రివర్స్ ఎటాక్ చేస్తున్న యాంటీబాడీస్

Coronavirus updates: కంచే చేనును మేస్తే కాచేవారెవరన్నట్లు ఉంది తాజా పరిశోధన సారాంశం. ఏ యాంటీబాడీస్ మనుషులకు రక్షణగా ఉంటున్నాయో... అవే తిరిగి ప్రమాదకరంగా మారుతున్నాయి.

news18-telugu
Updated: October 28, 2020, 7:53 AM IST
Covid 19: కరోనాను జయించిన వారికి షాక్. కొంతమందిలో రివర్స్ ఎటాక్ చేస్తున్న యాంటీబాడీస్
Covid 19: కరోనాను జయించిన వారికి షాక్. కొంతమందిలో రివర్స్ ఎటాక్ చేస్తున్న యాంటీబాడీస్ (NIAID)
  • Share this:
Coronavirus updates: కరోనా నుంచి కోలుకొని... వైరస్‌ను జయించిన వారి విషయంలో పరిశోధకులు ఓ షాకింగ్ మేటర్ చెప్పారు. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడానికి తయారయ్యే యాంటీబాడీస్... ఆ వైరస్‌ను జయించాక... అవే శత్రువులుగా మారుతున్నాయి. ముఖ్యంగా ల్యూపస్ (Lupu), రుమటాయిడ్ ఆర్థరైటిస్ (rheumatoid arthritis) పేషెంట్లకు ఈ అనారోగ్యాలు మరింత పెరుగుతున్నాయి. కారణం... కరోనాను ఎదుర్కొన్న అవే యాంటీబాడీలు... శత్రువుల్లా మారి వారిలో ఈ రోగాలు పెరిగేలా చేస్తున్నాయని పరిశోధనలో తేలింది. అంటే వారిలో తయారైన వ్యాధి నిరోధక శక్తే... వారికి వ్యాధిని తెస్తోందన్నమాట. కరోనాను ఎదుర్కోవడానికి ఇప్పుడు చాలా మంది ఇమ్యూనిటీని పెంచుకుంటున్నారు. అంటే... బాడీలో యాంటీబాడీలు పెరుగుతున్నాయి. కానీ... అవి... కరోనా లాంటి శత్రు వైరస్‌లు బాడీలోకి రాగానే అడ్డుకుంటాయి. అలాంటి యాంటీబాడీలే... శత్రువుల్లా మారితే... ఇక బాడీని కాపాడేదెవరు? అన్న ప్రశ్న తలెత్తింది.

కరోనా కారణంగా పుట్టుకొస్తున్న యాంటీబాడీలు... కరోనాను వదిలేసి... మనుషుల కణాల్లోని జన్యు పదార్థాలను నాశనం చేస్తున్నాయి. ఇది అందరిలోనూ జరగట్లేదు. కరోనా వైరస్ చాలా తీవ్రంగా ఉన్నవారికే జరుగుతోంది. అంటే... కరోనా సోకి... తిరిగి అది వెళ్లిపోయిన కొన్ని నెలల తర్వాత... ఈ పరిస్థితి కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ల్యూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేవి దీర్ఘకాలిక వ్యాధులు. ఇవి పూర్తిగా నయం కావు. కానీ... యాంటీబాడీస్ వల్ల ఇవి మరింత పెరగకుండా ఆపగలుగుతున్నారు. ఇదే పద్ధతిని కరోనాపైనా ప్రయోగిస్తున్నారు. తద్వారా... యాంటీబాడీలు బాగానే పనిచేసి... కరోనాను తరిమేస్తున్నాయి. ఆ తర్వాత... సీన్ రివర్స్ అవుతోంది. అవే యాంటీబాడీలు పేషెంట్లపై దాడి చేస్తున్నాయి. ఈ పరిశోధన ఫలితాల్ని ప్రిప్రింట్ సర్వర్ మెడ్జివ్ (MedRxiv)లో ఉంచారు. ఇంకా ఏ సైంటిఫిక్ జర్నల్‌ లోనూ ప్రచురించలేదు.

"దీనికి నేను ఆశ్చర్యపోవట్లేదు. కానీ ఇలా జరుగుతోందా అన్నది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. ఇలా జరిగే అవకాశం ఉంది. చిన్న, మధ్యస్థాయి వ్యాధులపై యాంటీబాడీలు ఇలా ప్రవర్తించే అవకాశం ఉంది" అని యాలే యూనివర్శిటీ ఇమ్యునాలజిస్ట్ అకికో ఇవాసాకీ అభిప్రాయపడ్డారు.

ఇలా ఎందుకు జరుగుతుంది:
దీనికి ఓ బలమైన కారణం ఉందని పరిశోధకులు అంటున్నారు. ఎలాగంటే... కరోనా వైరస్ బాడీలోకి వచ్చినప్పుడు... అది కణాలపై దాడి చేస్తుంది. ఈ సమయంలో... కణాలు చచ్చిపోతాయి. కొన్ని కణాలు నెమ్మదిగా సైలెంట్ గా చచ్చిపోతాయి. కొన్ని మాత్రం బాంబు పేలినట్లుగా పేలుతాయి. అలా పేలినప్పుడు వాటిలో ఉండే కరోనా వైరస్ కూడా ముక్కలవుతుంది. ఆ ముక్కలు... యాంటీబాడీస్‌లో పడి... అక్కడ వాటితో కలిసిపోతాయి. ఆ తర్వాత... ఆ యాంటీబాడీస్... తిరిగి వైరస్ లా ప్రవర్తిస్తాయి అని వివరిస్తున్నారు. కచ్చితంగా ఇలాగే జరుగుతోందా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఏది ఏమైనా ఈ కరోనాతో జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఇలాంటి పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా... ఇతరత్రా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందనే అంశాన్ని లోతుగా పరిశోధిస్తున్నారు. కరోనాకి వ్యాక్సిన్ వచ్చే వరకూ అప్రమత్తతే అసలైన రక్ష.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిన్న 4,47,349 కొత్త కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 4,42,23,262కి చేరింది. నిన్న 6907 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 11,71,155కి చేరింది. ప్రస్తుతం రికవరీ కేసులు 3,24,29,406 ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,06,22,701 ఉన్నాయి. వీటిలో 79,769 మందికి కరోనా తీవ్రంగా ఉంది. ప్రస్తుతం కరోనా సోకిన ప్రతి 100 మందిలో ఇద్దరు లేదా ముగ్గురు చనిపోతున్నారు.
Published by: Krishna Kumar N
First published: October 28, 2020, 7:53 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading