Russia Vaccine: గుడ్ న్యూస్... రష్యా వ్యాక్సిన్ సూపర్... కరోనాకి మూడినట్లే...

Coronavirus updates: ఇప్పటివరకూ రష్యా వ్యాక్సిన్ వేస్ట్ అనీ... హడావుడిగా తెస్తున్నారని విమర్శలున్నాయి. తాజాగా... లాన్సెట్ జర్నల్ ఈ వ్యాక్సిన్ వివరాలు చెప్పి... ప్రపంచానికి గుడ్ న్యూస్ ఇచ్చింది.

news18-telugu
Updated: September 5, 2020, 6:11 AM IST
Russia Vaccine: గుడ్ న్యూస్... రష్యా వ్యాక్సిన్ సూపర్... కరోనాకి మూడినట్లే...
Russia Vaccine: గుడ్ న్యూస్... రష్యా వ్యాక్సిన్ సూపర్... కరోనాకి మూడినట్లే... (File)
  • Share this:
Russia Vaccine Sputnik V: రష్యా ప్రభుత్వం వేగంగా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ "స్పుత్నిక్‌ వి" బాగా పనిచేస్తోందట. వ్యాక్సిన్‌ ప్రారంభ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ తెలిపింది. ఈ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో అందరిలోనూ కరోనా వైరస్‌ను అడ్డుకునే యాంటీబాడీలు వంద శాతం ఉత్పత్తయ్యాయని తెలిపింది. స్పుత్నిక్‌-v సరిగా పనిచేయదన్న వాళ్లకు తొలి పరీక్షల్లో తేలిన అంశాలే సమాధానమని రష్యా ప్రభుత్వం అంది. ఈ సంవత్సరం జూన్‌-జులైలో వ్యాక్సిన్‌పై జరిపిన రెండు దశల పరీక్షలో 76 మంది పాల్గొన్నారు. వారందరికీ యాంటీబాడీలు పెరిగాయి. అలాగే ఎవరికీ తీవ్రమైన సైడ్‌ఎఫెక్ట్స్‌ రాలేదని లాన్సెట్‌ చెప్పింది. ఈ వ్యాక్సిన్ వాడకాన్ని ఆగస్టులో రష్యా ప్రారంభించింది. ప్రస్తుతం రష్యాలో మాత్రమే దీన్ని వాడుతున్నారు. స్వయంగా అధ్యక్షుడు పుతిన్... తన కూతురికి తొలి వ్యాక్సిన్ ఇచ్చి... ప్రజల్లో ధైర్యం నింపారు.


అంతా బాగుంటే మరి ఈ వ్యాక్సిన్‌పై విమర్శలు ఎందుకన్న ప్రశ్న వస్తుంది. కారణం రష్యా వ్యవహరించిన తీరే. తొలి రెండు దశల ట్రయల్స్‌లో ఫలితాలు ఎలా వచ్చాయో రష్యా ప్రభుత్వం ప్రపంచానికి చెప్పలేదు. దానికి తోడు... మూడు దశల్లో ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాకే... వ్యాక్సిన్ విడుదల చెయ్యాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. రష్యా మాత్రం రెండు దశల్లో ప్రయోగాలు పూర్తవగానే... వ్యాక్సిన్ రిలీజ్ చేసుకుంది. అందువల్ల అది సరైన వ్యాక్సిన్ కాదని ప్రపంచ దేశాలు, నిపుణులు ఫైర్ అయ్యారు. లాన్సెట్ జర్నల్ కూడా... అప్పుడే ఈ వ్యాక్సిన్‌కి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయలేదు. ఇది సరైన వ్యాక్సినో కాదో తేలాలంటే... భారీ స్థాయిలో ఎక్కువ కాలం పరీక్షలు జరపాలని కోరింది.

రష్యా గత వారం 40వేల మందిపై పరీక్షలు జరిపింది. వాటి ఫలితాలు త్వరలో రానున్నాయి. ఈలోగా రష్యా భారీ ఎత్తున వ్యాక్సిన్ తయారుచేయబతోంది. ఈ సంవత్సరం చివరినాటికి నెలకు 20 లక్షల డోసుల్ని ఉత్పత్తి చేస్తూ క్రమంగా నెలకు 60 లక్షల డోసుల్ని తయారుచేస్తామంటోంది.

ఇప్పుడు రష్యా ప్రభుత్వం ఇతర దేశాల్లో తయారవుతున్న వ్యాక్సిన్లకు సవాల్ విసిరింది. "మీరు చేస్తున్న వ్యాక్సిన్లు ఏమాత్రం పనిచేస్తాయో చూస్తాం" అని రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సీఈఓ కిరిల్ దిమిత్రియెవ్ అన్నారు. తమ వ్యాక్సిన్‌ను భారీ ఎత్తున ఉత్పత్తి చేయడానికి భారత్‌తో భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: September 5, 2020, 6:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading