అయోడిన్ ద్రావణంతో కరోనాకి చెక్... పరిశోధనలో వైరస్‌పై విజయం

Coronavirus updates: కరోనాను చావగొట్టేందుకు ఇప్పటికే మనం చాలా రకాల పద్ధతులు తెలుసుకున్నాం. ఇప్పుడు అయోడిన్ ద్రావణం అసలైన మందు అంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 22, 2020, 9:20 AM IST
అయోడిన్ ద్రావణంతో కరోనాకి చెక్... పరిశోధనలో వైరస్‌పై విజయం
అయోడిన్ ద్రావణంతో కరోనాకి చెక్... పరిశోధనలో వైరస్‌పై విజయం (credit - NIAID)
  • Share this:
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌కి సంబంధించి రకరకాల పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా... కనెక్టికట్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్శిటీ సైంటిస్టులు... కొత్త అధ్యయనం చేశారు. తద్వారా అయోడిన్ ద్రావణం... కరోనాను పూర్తిగా నిర్మూలిస్తుందని చెబుతున్నారు. ఇది నిజంగా గొప్ప పరిశోధనే అనుకోవచ్చు. ఎందుకంటే... కరోనా వైరస్‌ని పూర్తిగా తరిమేయడం ఎలా అన్నది ఇప్పటివరకూ తెలియలేదు. తాజా పరిశోధన కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో రోజూ 90 వేల దాకా కొత్త కరోనా కేసులొస్తున్నాయి. ఇండియాలో 87వేల మందికి పైగా కరోనా వల్ల చనిపోయారు. ఇలాంటప్పుడు ఇండియాకి అయోడిన్ సొల్యూషన్ చాలా అవసరం అనుకోవచ్చు.

ఈ పరిశోధనలో సైంటిస్టులు... కరోనా వైరస్‌ని చంపేందుకు మూడు రకాలైన మోతాదుల్లో అయోడిన్ ద్రావణాన్ని ఉపయోగించారు. మొదటిది 0.5 శాతం, రెండోది 1.25 శాతం, మూడోది 2.5 శాతం. మూడు ప్రయోగాల్లోనూ అయోడిన్ ద్రావణాన్ని వాడిన 15 సెకండ్లలో కరోనా వైరస్ పూర్తిగా క్రియారహితంగా (inactivated) అవుతోందని తేలింది. పరిశోధకులు ఏమంటున్నారంటే... కరోనా పేషెంట్లకు అయోడిన్ ద్రావణాన్ని ఇస్తే... వారి ద్వారా ఇతరులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయంటున్నారు. అలాగే... పేషెంట్ల చుట్టూ ఉండే గాలిలో కరోనా వైరస్ లోడ్ తక్కువగా ఉంటుందంటున్నారు. ఈ పరిశోధన వివరాల్ని జామా (JAMA) ఓటోలారింగోలజీ హడ్ అండ్ నెక్ సర్జరీలో పొందుపరిచారు.

ఇదే పరిశోధనకు ఇథనాల్ అల్కహాల్ దరావణాన్ని కూడా ప్రయోగించి చూశారు. అది అంతగా పనిచేయలేదు. ఈ అధ్యయనం ప్రకారం... అయోడిన్ ద్రావణం... కరోనా వైరస్‌తోపాటూ... సార్స్, మెర్స్ వంటి వైరస్‌లను కూడా చంపగలుగుతోంది. అయోడిన్ ద్రావణాన్ని గాయాలపై మందులా రాస్తారు. తద్వారా అది గాయాలపై ఉండే సూక్ష్మక్రిములను చంపేస్తుంది. ఇప్పుడు అదే అయోడిన్ సొల్యూషన్... కరోనాకీ పనిచేస్తుండటం మంచి విషయమే.
Published by: Krishna Kumar N
First published: September 22, 2020, 9:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading