news18-telugu
Updated: November 2, 2020, 11:01 AM IST
కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన ప్రకటన.. ఆశ్చర్యపోతున్న దేశాలు (File)
Coronavirus updates: భవనానికి పునాది ఎంత ముఖ్యమో... ప్రపంచ దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంతే ముఖ్యం. కరోనా వైరస్ దేశాలపై దండెత్తినప్పటి నుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ... జాగ్రత్తగా ఉండాలని మొత్తుకుంటూనే ఉంది. ఇండియా లాంటి దేశాలు జాగ్రత్త పడ్డాయి. అమెరికా లాంటి దేశాలు లైట్ తీసుకొని... ఇప్పుడు తిప్పలు పడుతున్నాయి. ఇలా అందరికీ అప్రమత్త సందేశాలిచ్చే ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా చేసిన ప్రకటన అవునా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఏంటంటే... ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధానమ్ ఘెబ్రెయెసస్ (Tedros Adhanom Ghebreyesus)... తాను క్వారంటైన్‌కి వెళ్లినట్లు తెలిపారు. తాను కలిసిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలిందనీ... ఎందుకైనా మంచిదని తాను కూడా ఇప్పుడు ఐసోలేట్ అయ్యానని టెడ్రోస్ ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగా ఉన్నాననీ, తనకు ఏ కరోనా లక్షణాలూ లేవని ఆయన వివరించారు. కొన్ని రోజులపాటూ స్వయంగా క్వారంటైన్లో ఉంటాననీ... ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన కోవిడ్ 19 రూల్స్ పాటిస్తానని చెప్పారు. ఇంటి నుంచే తన పనిని చేస్తానని అన్నారు.
ఇప్పుడు టెడ్రోస్‌కి కరోనా సోకి ఉంటుందా అనే అనుమానం ఉంది. ఆయన WHO చీఫ్ కాబట్టి... కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలూ పాటిస్తారు. అలాంటి ఆయనే క్వారంటైన్‌కి వెళ్లడంతో... కరోనా నుంచి తప్పించుకోవడం ఎవరి వల్లా కాదేమో అనే డౌట్ వస్తోంది. ఎక్కడి దాకో ఎందుకు... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కరోనా బారిన పడ్డారు. కరోనాను తక్కువ అంచనా వేసినందుకు అంత పనైంది. తెలియకుండా వైరస్ బారిన పడితే... పోనీలే అనుకోవచ్చు. కానీ ట్రంప్ అన్నీ తెలిసే... కరోనాకి దొరికిపోయారు. తన నిర్లక్ష్యంతో అమెరికాను కరోనాకి కేంద్రంగా మార్చేశారు.
ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 4,68,04,418 కరోనా కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య 12,05,044కి చేరింది. రికవరీ కేసులు 2,37,42,719 ఉండగా... యాక్టివ్ కేసులు 1,18,56,655 ఉన్నాయి. వాటిలో 85,261 మంది పేషెంట్ల కండీషన్ సీరియస్‌గా లేదా క్రిటికల్‌గా ఉంది.ఇప్పుడైతే... యూరోపియన్ దేశాలు చాలా టెన్షన్ పడుతున్నాయి. ఎందుకంటే... గత సంవత్సరం డిసెంబర్లో చైనాలో కరోనా వచ్చాక... నెక్ట్స్ అది సోకింది యూరప్ దేశాలకే. చైనాలో కంట్రోల్ అయినా యూరప్ దేశాల్లో అస్సలు కంట్రోల్ కాలేదు. ఇప్పుడు మళ్లీ చలికాలం వస్తుంటే... అక్కడ సెకండ్ వేవ్ మొదలైంది. అది కంట్రోల్ అవుతుందో లేదో అనే టెన్షన్ ఉంది. గురువారం నుంచి బ్రిటన్‌లో నాలుగు వారాల లాక్ డౌన్ కూడా ప్రకటించారు. ఫ్రాన్స్‌లోనూ లాక్డౌన్ విధిస్తున్నారు. బెల్జియం కూడా అదే నిర్ణయం తీసుకుంది. అన్ని దేశాలూ ఇప్పుడు వ్యాక్సిన్ కోసం చూస్తున్నాయి. రష్యాలో వ్యాక్సిన్ వచ్చినా... అక్కడ ఇంకా పంపిణీ సరిగా లేదు. అసలా వ్యాక్సిన్‌పై ప్రపంచ దేశాలకు నమ్మకమూ లేదు. మొత్తంగా కరోనా నుంచి తప్పించుకోవడం కష్టమే అయినా... జాగ్రత్తలు పాటిస్తే మంచిదే.
Published by:
Krishna Kumar N
First published:
November 2, 2020, 11:01 AM IST