కణంలో ఉండే కరోనా ఫొటోలు రిలీజ్... మాస్కే కీలకం అంటున్న పరిశోధకులు

Coronavirus updates: మీరో మాస్కో, కర్చీఫో వాడుతున్నారా... అయితే మీరు గ్రేట్. ఎందుకంటే... కరోనాని బ్రేక్ వేయడానికి మాస్కే సరైనదని తాజా పరిశోధనతో అత్యంత క్లారిటీగా తెలిసింది.

news18-telugu
Updated: September 14, 2020, 10:46 AM IST
కణంలో ఉండే కరోనా ఫొటోలు రిలీజ్... మాస్కే కీలకం అంటున్న పరిశోధకులు
కణంలో ఉండే కరోనా ఫొటోలు రిలీజ్... మాస్కే కీలకం అంటున్న పరిశోధకులు (credit - NIAID)
  • Share this:
ఇప్పటివరకూ కరోనా వైరస్‌కి సంబంధించి చాలా ఫొటోలు బయటకు వచ్చాయి గానీ... కరోనా మన శరీరంలోని కణాలకు సోకిన తర్వాత ఆ కణం ఎలా ఉంటుందో, అందులో కరోనా ఎలా ఉంటుందో... ఇప్పటివరకూ ఒక్క ఫొటో కూడా రిలీజ్ కాలేదు. తాజాగా కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. ఆ ఫొటోలని గమనించిన తర్వాత ప్రపంచ పరిశోధకులు... అత్యంత క్లారిటీగా ఓ విషయం చెప్పారు. ఎవరైతే మాస్క్ వాడతారో... వాళ్లే కరోనాను అడ్డుకోగలరని తేల్చారు. మాస్క్ వాడేవాళ్లకు కరోనా వ్యాపించే అవకాశం తక్కువ అన్నది వాళ్ల తాజా ఉద్దేశం. కణాలకు సంబంధించి తీసిన ఫొటోలను సైంటిస్టులు బాగా లోతుగా పరిశోధించారు. తద్వారా... ఆ వైరస్ ప్రవర్తన, అది కణంలోకి ఎలా వెళ్తోంది? చొచ్చుకెళ్లడానికి అది ఏం చేస్తోంది... వంటి విషయాలపై స్పష్టత వచ్చింది. తద్వారా... మాస్క్ వాడితే... కరోనా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తేల్చారు.

కణంలో ఉండే కరోనా ఫొటో (Photo Credit: New England Journal of Medicine)


మాస్క్ వాడటం తప్పనిసరి:
మీకు కరోనా వచ్చినా, రాకపోయినా... మాస్క్ వాడటం తప్పనిసరి. మానవ శరీరంలో... కొన్ని కణాలు మొద్దుబారినట్లుగా... నిద్రాణంగా ఉన్నట్లుగా, యాక్టివ్‌గా లేనట్లుగా ఉంటాయి. కరోనా వైరస్... అలాంటి కణాలను ఎంచుకుంటోందని తాజా ఫొటోల ద్వారా అర్థమైంది. కణంలో దూరిన కరోనా వైరస్... ముందుగా కణం మొత్తాన్నీ అలా అలా చూస్తోంది. మనం కొత్త ఇంట్లోకి వెళ్లినప్పుడు ఇల్లంతా ఎలా చూస్తామో... అలా చూస్తోంది. ఆ తర్వాత కరోనా వైరస్ ఏం చేస్తోందో 96 గంటలు కంటిన్యూగా గమనించారు పరిశోధకులు. ఇందుకోసం అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ టెక్నాలజీని వాడారు. కరోనా వైరస్ ఉన్న కణానికి సంబంధించిన ఓ ఫొటోలను న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ పబ్లిష్ చేసింది. ఈ ఫొటోల ద్వారా కరోనా వైరస్ రూపురేఖలు మరింత స్పష్టంగా తెలిశాయి. ఒక్కో కణంలో ఎన్ని వైరస్‌లు ఉత్పత్తి అవుతున్నాయో... అవి ఎలా మానవ శ్వాస వ్యవస్థలోకి వెళ్తున్నాయో క్లియర్‌గా తెలిసింది.

డేంజరస్ కరోనా వైరస్:
వైరస్‌ అనేవి అత్యంత సూక్షక్రిములు. వాటికి జీవం ఉందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. వాటిలో జన్యువులు ఉంటాయి. వాటి చుట్టూ రక్షణగా ప్రోటీన్ పొర ఉంటుంది. కొత్త ఫొటోలను గమనించడం ద్వారా... కరోనా వైరస్‌ని ఎలా అంతం చెయ్యాలో మరింత ఎక్కువగా తెలుస్తుంది అంటున్నారు. ఈ ఫొటోలను చూసిన నార్త్ కరోలినా యూనివర్శిటీ సైంటిస్టులు... మాస్క్ గనక వాడితే... కరోనా వైరస్ సోకే అవకాశాలు తక్కువే అంటున్నారు. కరోనా సోకిన వారిలో వైరస్... శ్వాస సంబంధిత వ్యవస్థ పైపొరపై పెద్ద సంఖ్యలో ఉన్నట్లు తెలిసింది. అంటే వైరల్ లోడ్ అక్కడ ఎక్కువగా ఉంటోందని అర్థం. మొత్తంగా మనకు ఈజీ భాషలో అర్థమయ్యేది ఒకటే. బయటకు వెళ్లేటప్పుడు మాస్కో, కర్చీఫో వాడదాం. మాస్కంటే... రూ.10 సర్జికల్ మాస్క్ కాదు... కాస్త నాణ్యమైనదే వాడాలంటున్నారు నిపుణులు. ఆ విషయాలు ఆల్రెడీ మనకు తెలిసినవే.
Published by: Krishna Kumar N
First published: September 14, 2020, 10:46 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading