కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డామని ఊపిరిపీల్చుకుంటున్న వేళ.. మరో కొత్త వేరియెంట్ గుబులు పుట్టిస్తోంది. సౌతాఫ్రికాలో బయటపడిన B 1.1.529 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ కరోనా వేరియెంట్ మిగతా వాటితో పోల్చితే అత్యంత ప్రమాదకరమని, వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో చాలా ఉత్పరివర్తనాలు ఉన్నాయని, ఇప్పటి వరకు చూసిన వైరస్‌లో ఇదే ఘోరమైదని చెబుతున్నారు. కొద్దిరోజుల కిందట దక్షిణాఫ్రికాలో కనిపించిన ‘బి.1.1.529’ వేరియంట్ .. ఆ తర్వాత పొరుగుదేశం బోట్స్‌వానాతో పాటు హాంకాంగ్‌కూ వ్యాపించింది. తాజాగా ఇజ్రాయెల్, బెల్జియంలోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) టెక్నికల్ అడ్వైజరీ సమావేశమయింది. బీ.1.1.529ను ఆందోళనర వేరియెంట్‌గా గుర్తించింది. అంతేకాదు ఈ కొత్త వేరియెంట్‌కు 'ఒమిక్రాన్' అని పేరుపెట్టింది.
The Technical Advisory Group on SARS-CoV-2 Virus Evolution met today to review what is known about the #COVID19 variant B.1.1.529.
They advised WHO that it should be designated a Variant of Concern.
WHO has named it Omicron, in line with naming protocols https://t.co/bSbVas9yds pic.twitter.com/Gev1zIt1Ek
— World Health Organization (WHO) (@WHO) November 26, 2021
New Covid Variant: ఎయిడ్స్ రోగి నుంచి కరోనా కొత్త వేరియెంట్.. మరో ముప్పు పొంచి ఉందా?
దక్షిణాఫ్రికాలో సగటున రోజూ 200 మంది కరోనా బారిన పడుతున్నారు. కానీ గత ఐదు రోజులుగా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఐతే కొత్త వేరియెంట్ వల్లే కేసులు పెరుగుతున్నాయా? అనే విషయాన్ని అక్కడి ప్రభుత్వం వెల్లడించలేదు. మరోవైపు సౌతాఫ్రికా నుంచి ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. అక్కడి నుంచి వెళ్లిన వారిలో కొత్త వేరియెంట్ బయటపడుతోంది. ఇజ్రాయెల్‌లో నాలుగు ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు నమోదయ్యాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన 32 ఏళ్ల మహిళలో మొదట ఈ వేరియెంట్‌ను గుర్తించారు. ఐతే ఆమె ఇప్పటికే మూడు డోసుల ఫైజర్ వ్యాక్సిన్ తీసుకుంది. ఐనప్పటికీ కొత్త వేరియెంట్ బారినపడింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటుచేసి.. కొత్త వేరియంట్‌పై సమీక్షించారు. తమ దేశం అత్యయిక పరిస్థితి ఆరంభంలో ఉన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు.
Covid's 'Patient Zero: కరోనా రోగాన్ని తెచ్చింది ఈమే.. ఆ తర్వాతే అందరికీ సోకి.. ప్రపంచమంతటా వ్యాప్తి
కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకుతోంది. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది అత్యంత ప్రమాదకారి కావచ్చనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు వెలుగుచూసిన కోవిడ్ వేరియెంట్ల కంటే ఇది వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణుల హెచ్చరికలతో అన్ని దేశాలు అప్రమత్తమవుతున్నాయి. దక్షిణాఫ్రికా సహా మొత్తం ఆరు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై ఇజ్రాయెల్ ఇప్పటికే ఆంక్షలు విధించింది. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, లెసాతో, ఎస్వాతిన్, జింబాబ్వే, నమీబియాల నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్, జపాన్‌లు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాయి.
జర్మనీని హడలెత్తిస్తున్న కరోనా.. ఆ దేశంలో కొత్త వేరియంట్ ప్రవేశించినట్లు అనుమానం
ఐతే భారత్‌లో మాత్రం ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియెంట్ కేసులు నమోదు కాలేదని ఇండియన్ సార్స్-కొవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకాగ్) వెల్లడించింది. ఐనప్పటికీ ప్రజలంతా కోవిడ్ నిబంధనలను పాటించాలని సూచించింది. ఒమిక్రాన్ వేరియెంట్‌కు వ్యాక్సిన్ల నుంచి తప్పించుకోగల, మునుపటి డెల్టా కంటే తీవ్రంగా వ్యాపించే సామర్థ్యం ఉంటే మరోసారి కోవిడ్ ఉద్ధృతి తప్పకపోవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Coronavirus, Covid-19, Omicron corona variant, South Africa