కరోనా వైరస్ ల్యాబ్‌లో తయారుచేసిందే... చైనా వైరాలజిస్ట్ వాదన

Coronavirus updates: కరోనా వైరస్ ఎలా పుట్టిందనే అంశం ఇప్పటికీ సస్పెన్సే. అది సహజసిద్ధంగా పుట్టలేదనీ... ల్యాబ్‌లో తయారుచేశారని చైనా వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ అంటున్నారు.

news18-telugu
Updated: September 13, 2020, 6:34 AM IST
కరోనా వైరస్ ల్యాబ్‌లో తయారుచేసిందే... చైనా వైరాలజిస్ట్ వాదన
కరోనా వైరస్ ల్యాబ్‌లో తయారుచేసిందే... చైనా వైరాలజిస్ట్ వాదన (credit - NIAID - Twitter)
  • Share this:
Coronavirus updates: ఇది నిజమే అయితే... ప్రపంచ దేశాలన్నీ చైనాను శాశ్వతంగా బహిష్కరిస్తాయనుకోవచ్చు. ఎందుకంటే... చైనా వైరాలజిస్ట్ (వైరస్‌లపై అధ్యయనం చేసే శాస్త్రవేత్త) లి-మెంగ్ యాన్... కరోనా వైరస్... ల్యాబ్‌లో తయారుచేసిందే అంటున్నారు. చైనాలోని వుహాన్ నగరంలో 2019 డిసెంబర్‌లో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్... విషయం... చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు ముందే తెలుసంటున్నారు ఆమె. ఆ వైరస్‌ని ఎప్పుడో సృష్టించారనీ, ప్రజలకు మాత్రం గతేడాది పరిచయం చేశారని ఆమె అంటున్నారు. తన వాదనకు తన దగ్గర ఆధారం కూడా ఉందన్నారు లి. ప్రస్తుతం ఆమె హాంకాంగ్‌లో ఉంటున్నారు. కరోనా వైరస్ రహస్యాల్ని బయటపెడితే... తనను చైనా అధికారులు బంధిస్తారన ఉద్దేశంతోనే ఆమె హాంకాంగ్‌లో ఉంటున్నట్లు తెలిపారు. తన ఆధారాన్ని త్వరలోనే పబ్లిష్ చేస్తాననీ... ఆ వైరస్... సింథటిక్ (Synthetic) అనీ... సైంటిస్టులు కాని వారు కూడా దాన్ని గుర్తించగలరని ఆమె అంటున్నారు. బ్రిటన్‌లోని ITVలో వచ్చే టాక్ షో లూస్ వుమన్‌లో... హోస్ట్ జాన్ మూర్‌తో ఇంటర్వ్యూలో లీ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈ వైరస్ ఎక్కడ పుట్టిందని మీరు అనుకుంటున్నారు అని హోస్ట్ అడగ్గా... "అది వుహాన్‌లోని ల్యాబ్ నుంచి వచ్చింది" అని లి-మెంగ్ యాన్ అన్నారు. ఇదివరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫ్రాన్స్‌కి చెందిన ఓ వైరాలజీ నిపుణుడు కూడా... వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్ పుట్టిందని ఆరోపించారు. "వైరస్ జన్యుపటం... మన వేలి ముద్రలలాగే ఉంటుంది. దాన్ని నేను ఆధారంగా నిరూపిస్తారు. ఎవరైనా దాన్ని గుర్తించగలరు" అని లి అన్నారు.గతేడాది తాను హాంకాంగ్ వచ్చేశానన్న లీ-మెంగ్ యాన్... చైనా కనుసన్నల్లో నడిచే హాంకాంగ్ అధికారుల నుంచి తనకు ప్రమాదం పొంచి ఉందని... ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను ఓ రహస్య ప్రదేశంలో ఉన్నానన్న ఆమె... తన బయోడేటా మొత్తం చైనా ప్రభుత్వం డిలీట్ చేసిందని తెలిపారు.


వుహాన్‌లోని వెట్ మార్కెట్ నుంచి కరోనా వైరస్ వచ్చిందనే చైనా ప్రభుత్వ వాదన పచ్చి బూటకం అన్న లీ... వైరస్‌ని మనుషులే తయారుచేశారని తాను ఆధారాలతో రిపోర్ట్ పబ్లిష్ చేస్తానని అన్నారు. ఓ సైంటిస్టుగా తాను... నీతి నిజాయితీలకు కట్టుబడి ఉన్నానన్నారు. చైనా కవరప్ కుట్రను బయటపెడతానన్నారు.
Published by: Krishna Kumar N
First published: September 13, 2020, 6:34 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading