Corona Vaccine: దొంగ డ్రాగన్... కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను దొంగిలిస్తున్న చైనా హ్యాకర్లు

Coronavirus updates: చైనా ఓ ప్రమాదకర దేశం అని మరోసారి రుజువైంది. ఇతరులు కష్టపడి తయారుచేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఫార్ములాని ఆ దేశ హ్యాకర్లు దొంగిలిస్తున్నట్లు తెలిసింది.

news18-telugu
Updated: September 6, 2020, 8:35 AM IST
Corona Vaccine: దొంగ డ్రాగన్... కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను దొంగిలిస్తున్న చైనా హ్యాకర్లు
Corona Vaccine: దొంగ డ్రాగన్... కరోనా వ్యాక్సిన్ ఫార్ములాను దొంగిలిస్తున్న చైనా హ్యాకర్లు (File)
  • Share this:
Coronavirus updates: కరోనా వైరస్ వ్యాక్సిన్ డేటాను దొంగిలించాలని చైనా ఇంటెలిజెంట్ హ్యాకర్లు నిర్ణయించినట్లు తెలిసింది. మిగతా దేశాల్లాగా కష్టపడి కరోనా వ్యాక్సిన్ ఫార్ములా కనిపెట్టే బదులు... ఆ దేశాలు తయారుచేసిన వ్యాక్సిన్ ఫార్ములాను దొంగిలిస్తే సరిపోతుందన్నది హ్యాకర్ల ఉద్దేశంగా తెలిసింది. నార్త్ కరోలినా యూనివర్సిటీతోపాటూ... ఇంకా చాలా స్కూళ్లలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ జరిగి... ఫార్ములాను తయారుచేస్తున్నారు. ఈ ఫార్ములాను ఫార్మా కంపెనీలకు అందిస్తారు. ఆ ఫార్ములా ఆధారంగా ఫార్మా కంపెనీలు... వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తాయి. ఇలా అందించిన ఫార్ములాను దొంగిలించడం ద్వారా ఈజీగా పనైపోతుందని చైనా హ్యాకర్లు భావిస్తున్నట్లు తెలిసింది.

రష్యాకి చెందిన ప్రీమియర్ ఇంటెలిజెన్స్ సర్వీస్... SVR... కూడా... అమెరికా, కెనడా, బ్రిటన్‌లో వ్యాక్సిన్ రీసెర్చ్ నెట్‌వర్కులను టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఇలాంటి దొంగ చర్యలు జరుగుతున్నట్లు బ్రిటన్‌లోని స్పై ఏజెన్సీ కనిపెట్టింది. ఇంటర్నేషనల్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్‌ని మానిటరింగ్ చేయడం ద్వారా... ఆ ఏజెన్సీ ఈ విషయాన్ని కనిపెట్టింది.

ఇరాన్ కూడా ఈ లిస్టులో చేరింది. అమెరికాలో పరిశోధనల డేటాను దొంగిలించేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. దీనిపై అలర్టైన అమెరికా ప్రభుత్వం... నిఘాను మరింత పెంచింది. డేటా చోరీ అవ్వకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒక్క మాటలో చెప్పాలంటే... ప్రపంచంలోని చాలా స్పై సర్వీస్ ఏజెన్సీలు ఇలా డేటా చోరీకి యత్నిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

డేటా చోరీ అంత ఈజీయా:
హ్యాకర్లు తలచుకుంటే... ఏ డేటా అయినా చోరీ చెయ్యగలరు. ఎందుకంటే... ఏ డేటా అయినా ఇంటర్నెట్‌తో లింక్ అయ్యి ఉంటుంది. అందువల్ల అదే ఇంటర్నెట్‌ని వాడి హ్యాకర్లు చోరీ చేస్తారు. ఐతే... ఇంటర్నెట్‌తో సంబంధం లేని డేటాను మాత్రం హ్యాకర్లు చోరీ చెయ్యలేరు. కానీ... కరోనా వైరస్‌కి సంబంధించి జరుగుతున్న ట్రయల్స్, ఆ డేటా మొత్తాన్నీ ప్రతీ ఫార్మా సంస్థా... ఇంటర్నెట్ ఉండే కంప్యూటర్లలోనే స్టోర్ చేస్తున్నాయి. అక్కడే హ్యాకర్లకు ఛాన్స్ దొరుకుతోంది. ఎన్ని పాస్‌వర్డ్స్ పెట్టినా... అన్నింటినీ క్రేక్ చెయ్యగల టాలెంట్ హ్యాకర్లకు ఉంటుంది. కాకపోతే... క్రేక్ చేసేటప్పుడు అలర్ట్ మెసేజ్ వస్తే... అలర్టయ్యే పరిశోధకులు... డేటా చోరీ అవ్వకుండా... నెట్ కనెక్షన్ తీసేస్తే... చోరీ జరగదు. ఇలా డేటా చోరీ అంశం... కరోనా వ్యాక్సిన్ తయారీ దారులకు సవాల్ విసురుతోంది.
Published by: Krishna Kumar N
First published: September 6, 2020, 8:35 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading